ముందస్తు ఎన్నికలపై రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ పంచ్ (వీడియో)

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలంతా ఓటమిపాలయ్యారు. వారి జాబితాలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. కొడంగల్ లో ఆయన 9వేల పైచిలుకు ఓట్ల తేడాలో టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి మీద ఓడిపోయారు. రేవంత్ రెడ్డి ఓటమిని ఆయన అభిమానులు, కార్యకర్తలే కాదు యావత్ తెలంగాణ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. అర్రే… రేవంత్ రెడ్డి ఓడిపోవడమేంటి? అని అందరూ షాక్ అయ్యారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. అని రేవంత్ ఒక్క ముక్కలో తేల్చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఈవిఎం ల మీద విమర్శలు గుప్పించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆరకమైన విమర్శలు, ఆరోపణలేమీ చేయలేదు. 

ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగ్ సమయంలో రేవంత్ రెడ్డి రెండు మూడు నిమిషాల పాటు మీడియాతో మాట్లాడారు. తప్పితే ఇప్పటి వరకు గత 12 రోజులుగా రేవంత్ రెడ్డి మీడియా ముందుకు, జనాల ముందుకు రాలేదు. ఆయన ఏం మాట్లాడతారా? అని ఆయన అభిమానులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. టిఆర్ఎస్ గెలుపు, కాంగ్రెస్ ఓటమిపై ఎవరెవరు ఏమేమి మాట్లాడినా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారంటూ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మీడియా ముందుకు రాని రేవంత్ రెడ్డి ఆదివారం కొడంగల్ లో పర్యటించారు. 

కొడంగల్ లో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సాదారణంగా ఎన్నికలు అనేవి ఐదేళ్లకు ఒకసారి వస్తాయి… కానీ కేసిఆర్ లాంటివాళ్లు ఉన్నప్పుడు ముందగానే కూడా వస్తాయి అంటూ ఒక ఘాటైన కామెంట్ చేశారు. కార్యకర్తల సభలో రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల గురించి ఏం మాట్లాడారో కింద వీడియోలో చూడండి.