అందుకే కేసిఆర్ ఓటుకు నోటు కేసు తిరగతోడుతున్నడు : రేవంత్

తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో తనను, తన కుటుంబసభ్యులను మరోసారి ఓటుకు నోటు కేసును తిరగదోడి అరెస్టు చేేసేందుకు కేసిఆర్ మోడీతో ఒప్పందం చేసుకున్నాడంటూ ఆరోపణలు గుప్పించారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి పలు కీలకమైన ఆరోపణలు చేశారు. డిజిపి మహేందర్ రెడ్డిని కాశీం రజ్వీతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు రేవంత్. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో కింద చదవండి.

ప్రభుత్వ రద్దుకు ముందు తండ్రి కేసిఆర్, కొడుకు కేటిఆర్ ఢిల్లీ పర్యటనను చేపట్టారు. కొన్ని సార్లు అధికారికంగా, కొన్ని సార్లు రహస్యంగా హస్తిన పర్యటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ హక్కుల కోసం కాకపోగా, తమ స్వంత లబ్ధి  కోసం అని మేము చాలా సార్లు చెప్పాము. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తరువాత, కాంగ్రెస్ పార్టీలో రాణించకుండా కుట్ర చేపట్టాడు కానీ కేసీఆర్ సఫలీకృతం కాలేదు. 

కాంగ్రెస్ పార్టీలో ముందస్తు ఎన్నికల సందర్బంగా రేవంత్ రెడ్డి కి పదవి ఇస్తే టీఆర్ఎస్ ను అడ్డుకుంటాడు అని అక్రమ కేసులు పెట్టించాడు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఓటుకు నోటు కేసు తీస్తున్నారు మళ్లీ. ఎ4 గా ఉన్న మత్తయ్య  ఎఫ్ఐఆర్ చేయకుండా అరెస్టు చేశారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే ఆయన మీద కేసును హైకోర్టు కొట్టేసింది.

చంద్రబాబు స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడాడు అని అందులో ఇరికించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదు. ఇప్పుడు కేసీఆర్, మోడీ రహస్య ఒప్పందం ద్వారా మరోసారి కేసును తిరగదొదాలనుకుంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు నచ్చక చంద్రబాబు ప్రభుత్వం నుండి బయటకి వచ్చాడు.

అప్పటి నుండి ఈ కేసీఆర్, మోడీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు లాగా ఈడీ, సీబీఐ ద్వారా ఓటుకు నోటు కేసు పైన నా పైన, నా బందువులపైన ఇన్ కం టాక్స్ దాడులు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రణాళిక బద్దంగా నా పైన, నా కుటుంబ సభ్యులు పైన ఈడీ దాడులు చేయాలని సిద్ధమైంది.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. దీనికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ కు చట్టాన్ని ఉల్లంఘించి మరీ సహకరిస్తున్నారు. డీజీపీ పాత డేట్ల పైన లేఖలు రాస్తున్నారు నా పైన విచారణకు. చట్టవ్యతిరేకమైన చర్యలతో ప్రైవేట్ సైన్యంతో డీజీపీ కేసీఆర్ కు కాసిమ్ రాజ్వి లాగా చేస్తున్నాడు.

నాకు,నా కుటుంబ సభ్యులకు ఏమి జరిగినా, కేసీఆర్, ప్రభాకర్ రావు, డీజీపీ పే కారణం. కాంగ్రెస్ అధినాయకత్వం నాకు ముఖ్యమైన పదవి ఇచ్చే అవకాశం ఉండటంతో, రాష్ట్రం అంతా తిరుగుతాడు కాబట్టి ఇలాంటి పనులకు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుట్ర చేస్తున్నది. రేవంత్ రెడ్డి మీద ఈడీ దాడులు జరుగుతాయి అని పార్టీ శ్రేణులకు మెస్సేజ్ ఇచ్చారు కేసీఆర్.

జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ మీద అక్రమ కేసులు పెట్టించిన కేసిఆర్ ఇప్పుడు తనపైనా అక్రమ కేసులు పెట్టబోతున్నారు. చివరకు విమలక్క, హరగోపాల్, చుక్కా రామయ్య లను కూడా వదిలిపెట్టడంలేదు. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను.

డీజీపీ మహేందర్ రెడ్డి ఏ కేసీఆర్ ప్రైవేట్ సైన్యానికి అధిపతి. నాకు పదవి ఇచ్చే రెండు రోజుల ముందే నా పై ఈడీ దాడులు జరుగుతాయి. చిప్ప కూడు తిన్న విశ్వాసంతో చెప్తున్న మీ పైజామాలు ఉడుతాయి.