కేసీఆర్ పై ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు

million dislikes for man ki beat modi twitter account hacked

నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాన్ పూర్ ఎన్నికల సభలో ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మే నెలలో లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తే ఘోరంగా ఓడిపోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెప్పడం వల్లే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు నిర్వహించాడని మోదీ ఆరోపించారు. 

మే మాసంలో మీ జాతకం బాగాలేదు, నరేంద్ర మోదీ జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఆయన దూసుకుపోతారు, వారి ముందు మీరు నిలబడలేరు, వారి ధాటికి తట్టుకోలేరు, వారి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే పార్లమెంటు ఎన్నికలతో పాటు కాకుండా విడిగా ఎన్నికలు జరుపుకోవాలని జ్యోతిష్యులు కేసీఆర్ కు సూచించారని తెలిపారు.

అంతేకాదు, మే నెలలో ఎన్నికలకు వెళితే టీఆర్ఎస్ పార్టీ కూడా ముక్కలుచెక్కలవుతుందని ఆ జ్యోతిష్యుడు చెప్పాడని ప్రధాని వివరించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఒక జ్యోతిష్యుడు చెప్పినట్టు నడవాలా? లేక ప్రజల అభీష్టానుసారం నడవాలా? అని మోదీ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్ సభ ఎన్నికలతో పాటే నిర్వహించి ఉంటే ఎంతో ఖర్చు తగ్గేదని, ఇప్పుడా ఖర్చు ఎవరికి భారంగా మారనుంది? అని ప్రశ్నించారు.

వారిది ప్రజల కోసం ఏర్పాటైన ప్రభుత్వం అయితే ఎన్నికల తర్వాత మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి 3 నెలల సమయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు మంత్రివర్గ ప్రకటనలో జాప్యం చేశారని విమర్శించారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అల్లుడు, కొడుకు, కూతురు బాగుపడ్డారు తప్ప ప్రజల జీవితాల్లో మార్పేమీ రాలేదని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. దృఢమైన ప్రభుత్వం కోసం బీజేపీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.