కేసీఆర్ ను తిట్టినందుకు నర్సు సస్పెండ్

ఓ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ను తిట్టిందని నర్సును సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి సీఎంని, ఐఏఎస్ అధికారులను తిట్టిందని అది నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తుందని తెలిపారు.

బేగంపేటలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎస్కే ప్రసన్న నర్సుగా పని చేస్తోంది. ఇటివల ఓ పార్టీ వారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రసన్న దగ్గరికి రాగా వారితో ప్రసన్న సీఎం కేసీఆర్ పై పరుష పదజాలంతో తిట్టారని, అలాగే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారిని కూడా తిట్టారని ఆరోపణలున్నాయి. ప్రసన్న తిట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 దీంతో ఆ వీడియో ఆధారంగా చర్యలు తీసుకొని ప్రసన్నను సస్పెండ్ చేస్తున్నట్టు ఆరోగ్య కుటుంబ శాఖ సంక్షేమ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి పరుష పదజాలం వాడటం సరికాదని ఆయన అన్నారు. తదుపరి విచారణ తర్వాత ప్రసన్న పై శాఖా పరమైన చర్యలుంటాయని ఆయన తెలిపారు.

ప్రసన్న ను సస్పెండ్ చేయడాన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఖండించారు. ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రసన్న వాక్ స్వాతంత్ర్యంను హరించడమే అన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నంత మాత్రాన వారికి లొంగి ఉండాలా అని వారు ప్రశ్నించారు. తన అభిప్రాయాన్ని చెప్పడ్డం తప్పు ఎలా అవుతుతందో చెప్పాలని వారు ప్రశ్నించారు. తక్షణమే ప్రసన్న పై సస్పెండ్ ను ఎత్తి వేయాలని లేనిచో కీలక పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.