టిఆర్ఎస్ కవితక్కా.. జర ఇటు సూడక్కా (వీడియో)

తెలంగాణ ప్రభుత్వంపై భ్రమలు తొలిగిపోవడంతో ఒక్కో సెక్షన్ పోరుబాట పడుతున్నది. ఇంతకాలం తమకు న్యాయం చేస్తారేమోనని ఆశతో ఉన్న వర్గాలన్నీ ఇక తాడో పేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగుతున్నాయి. ఇచ్చి హామీలు అమలు చేయాలని గట్టిగా అడిగితే పాలకులకు ఎక్కడ కోపమొస్తుందోనని భయపడి సైలెంట్ గా ఉన్న సెక్టార్లన్నీ పోరుబాటపడుతున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో మేప్మా రిసోర్స్ పర్సన్స్ కనీస వేతనాలు ఇవ్వాలంటూ నిరసర వ్యక్తం చేశారు. మేప్మా సిబ్బంది అంతా పింక్ చీరలు కట్టుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొనడంతో టిఆర్ఎస్ వాళ్లే ధర్నా చేస్తున్నారా అని జనాలు పరేషాన్ అయితున్నారట. కనీస వేతనాల కోసం ఎన్నో రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర మహిళా నాయకురాలు తిరునగరి జ్యోత్స్న, నిజామాబాద్ జిల్లా మహిళా నాయకురాలు సరళ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే మేప్మా ఉద్యోగులకు కనీస వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. మేప్మా ఉద్యోగుల ఆందోళన వీడియో కింద ఉంది.