మోడీ హైదరాబాద్ వచ్చి కెసిఆర్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా?

modi planning to give big shock to kcr

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చార ఉధృతి కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా చేసుకొని బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు సాగుతున్నాయి.తాజాగా కొత్త గేమ్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌న వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. తాజాగా ప్ర‌ధాని హైద‌రాబాద్ టూర్ నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

modi planning to give big shock to kcr
modi planning to give big shock to kcr

కరోనా వైరస్ కట్టడి చేయాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ రావాల్సి ఉండ‌గా ఇండియాలో నాలుగు కరోనా వ్యాక్సిన్ లు తయారవుతున్నాయి. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్, ఐసిఎంఆర్ సంస్థలు కలిసి కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ఉంది. మొదటి రెండు దశల్లో మంచి ఫలితాలు ఇవ్వడంతో మూడో దశ ట్రయల్స్ కూడా ఆశాజనకంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు ఈనెల 28వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఈ నెల 28వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు వస్తారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు.

హైదరాబాద్ లో ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల హడావుడి ఉంది. ఎన్నికల ప్రచారానికి అదే చివరి రోజు కావడంతో మోడీ రాకపై ఆసక్తి నెలకొంది. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమం తరువాత మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేక ఆ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోతారా అన్న చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. మ‌రోవైపు , మోదీ రాక మాత్రం ప్ర‌చారంలో భాగ‌మ‌ని చెప్తున్నారు. ఇదిలాఉండ‌గా, జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మ‌హారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విడుద‌ల చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఫడ్నవిస్ తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా ఉందన్నారు. ప్రజలకు ఏం కావాలో తాము అర్థం చేసుకున్నామన్నారు. ప్రజలతో మాట్లాడి మేనిఫెస్టో తయరు చేశామని , ప్రజలు తమ పార్టీ ని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.