ప్రమాణం చేయకముందే ఫిర్యాదులు.. వాటిని ద్రౌపది ముర్ము పట్టించుకుంటారా?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీపై విమర్శలు చేయడం ద్వారా ప్రజల్లో బలం పెంచుకోవడంతో పాటు బీజేపీని బలహీనపరచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ద్రౌపది ముర్ము ప్రమాణమే చేయకుండానే కేటీఆర్ ఫిర్యాదులు చేయడం గమనార్హం. ఈ నెల 25వ తేదీన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆ తర్వాత రాష్ట్రపతిగా తన విధులను పూర్తిస్థాయిలో తెలుసుకోవడంతో పాటు దేశ పరిస్థితులను అర్థం చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా ద్రౌపది ముర్ము వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే కేటీఆర్ మాత్రం రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పూర్తి చేయాల్సిన కొన్ని డిమాండ్ల గురించి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేయడం గమనార్హం. మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కీలక వ్యాఖ్యలు చేశారు.

ద్రౌపది ముర్ము గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రంను ఒప్పించాలని మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో కూడా కరెంట్ ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేంద్రం దగ్గర గిరిజన రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉందని కేటీఆర్ కామెంట్లు చేశారు. తెలంగాణ పంపిన గిరిజన రిజర్వేషన్ బిల్లును కేంద్రం అమలు చేసేలా చూడాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని నేతలు పద్ధతి మార్చుకోని పక్షంలో చూస్తూ ఊరుకోనని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రం కేంద్రానికి ఇచ్చిన మొత్తమే ఎక్కువని కేటీఆర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ ఘాటుగా చేస్తున్న విమర్శలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.