తెరాస ప్రభుత్వానికి కాంప్లిమెంట్ గా బీజేపీ మేనిఫెస్టో ఉందంటూ కేటీఆర్ సెటైర్లు

minister ktr setires on bjp manifesto in social media

హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ బీజేపీ విడుదల చేసింది.ఇందులో ఉచితంగా మంచినీరు, ఎల్ఆర్ఎస్ రద్దు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లక్ష ఇళ్లు, మూసీ నది ప్రక్షాళన లాంటి వరాలను గ్రేటర్ ప్రజలకు అందించారు.అంతే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. హైదరాబాద్ వాసులను ఉచితంగా కరోనా వాక్సిన్ అందజేస్తారట. బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికలపై మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్ సెటైర్లు చేశారు. దుమ్మెత్తిపోశారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ మేనిఫెస్టో రైటర్స్ కు తెలివి ఉందా అని ఎద్దేవా చేశారు.జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఫొటోలు అన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించిన ఫొటోలు వాడడం మీద ఇలా రియాక్ట్ అయ్యారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు తమ మేనిఫెస్టోలో బీజేపీ వాడిందని.. ఇది తాము కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నామని చురకలంటించారు.

ఇలా వాడడాన్ని హైదరాబాద్ లో ఏమంటారో తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలే అని ‘కల్ మార్ నే ఖోచీ అఖిల్ ఛాహియే’ అంటూ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.బీజేపీ మేనిఫెస్టో ఫేక్ అంటూ పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేస్తూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. ‘నకల్ మార్ నే ఖో భీ అకల్ ఛాహియే’ అంటూ కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె.. బండన్న నీ తెలివికి దండ రా నాయనా.. ఫేక్ బీజేపీ’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి స్పందిస్తూ కేటీఆర్ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు.