వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా చేయాలని ఆదేశించిన మంత్రి కేటీఆర్..!

తాజాగా తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు విషయాలు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలి అని ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల ప్రభావం వల్ల హైదరాబాద్ తో పాటు పట్టణంలో చేపట్టాల్సిన సహాయక చర్యల గురించి మాట్లాడారు.

ఇక ప్రాణం నష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేయాలి అని అన్నారు. వర్షాలు కొనసాగితే ముందు జాగ్రత్తలపై సిద్ధంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా పునరాతన భవనాలను తొలగించే పనులు చేపట్టాలని.. వంతెనల వద్ద హెచ్చరిక సూచనలు పెట్టాలి అని అన్నారు. ఇక జీహెచ్ఎంసీ, జలమండలి సేవలు వినియోగించుకోవాలని అన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని.. వర్షాలు తగ్గాక రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు