రేవంత్ రెడ్డి తమ్ముడికి పోలీసుల సీరియస్ వార్నింగ్ (వీడియో)

శనివారం రాత్రి కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేవంత్ అనుచరుడు రామ్ చందర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రామ్ చందర్ రెడ్డి ఇంట్లో మద్యం, డబ్బు నిల్వ ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

పోలీసుల దాడుల విషయం తెలుసుకున్న బొంరాస్ పేట కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో రామ్ చందర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. వారు ఆందోళన నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రామ్ చందర్ రెడ్డి ఇంట్లో సోదాలు విషయం తెలుసుకున్న రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు.

ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కొండల్ రెడ్డి పై బెదిరింపులకు దిగినట్టు అనుచరులు ఆరోపిస్తున్నారు. నీ సంగతి చూస్తామంటూ బెదిరించారన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండానే ఇంట్లోకి వచ్చి పోలీసులు మహిళలతో దురుసుగా ప్రవర్తించారన్నారు.

సోదాలు జరిపినా ఏమి దొరకలేదని పోలీసులు, అధికారులు తెలిపారు. దీనిని వ్రాత పూర్వకంగా రాసివ్వాలని కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు, కొండల్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో ఏం చేయలేక పోలీసులు అక్కడ నుంచి వెళ్లి పోయారు. కొండల్ రెడ్డితో పోలీసుల వాగ్వాదం వీడియో కింద ఉంది చూడండి.