హైదరాబాద్‌లో లగ్జరీ దొంగ.. ఏం చేశాడంటే?

స్టార్ హోటల్స్ లో చోరీలకు పాల్పడే లగ్జరీ దొంగ రావ్‌ను హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. అండమాన్ కు చెందిన రావ్ స్టార్ హోటల్స్ లో మకాం వేస్తాడు. అక్కడి నుంచి ప్రముఖ జ్యువెలరీ షాపులకు ఫోన్ చేసి బంగారు ఆభరణాలు కొంటాను తీసుకురమ్మని చెప్తాడు. షాపు వాళ్లు వచ్చి ఆభరణాలు చూపించాక వారిని మాటల్లోకి దింపి ఆ నగలతో అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇప్పటి వరకు 25 నగరాల్లో ఈ చోరీలకు పాల్పడ్డాడు. వచ్చిన డబ్బుతో అమ్మాయిలకు వలవేసి వారితో జల్సాలు చేస్తాడని పోలీసులు తెలిపారు. నాలుగు సంవత్సరాల క్రితం చెన్నైలో  ఓ అమ్మాయితో వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకుని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆమెను రేప్ చేసి హత్య చేశాడు. ఈ కేసులో అరెస్టయ్యి నెల క్రితమే అతను జైలు నుంచి విడుదలయ్యాడు.  అయినా అతని వక్రబుద్ది మారక తిరిగి దొంగతనాలకు పాల్పడుతుండటంతో పోలీసులు పకడ్బంధి స్కెచ్ తో రావ్ ను అరెస్టు చేశారు. ఇతని కోసం ఢిల్లీ, ముంబాయి, బెంగుళూరు, చెన్నై, కోల్ కత్తా పోలీసులు గాలింపు చేస్తుండగా ఆ లగ్జరీ దొంగ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు.