కేటీఆర్ కు వ్యాక్సిన్‌ ఫస్ట్ డోసు… ఎందుకింత లేట్ మంత్రి గారు?

KTR took the first dose of the covid vaccine on Tuesday

కరోనా మహమ్మారి నుండి ప్రాణాలను కాపాడుకునేందుకు మనకున్న ఆయుధం వాక్సినేషన్ మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. దేశంలో వాక్సినేషన్ పక్రియ మొదలయ్యి చాలా కాలం అయ్యింది కదా… మరి కేటీఆర్ గారు ఇప్పుడు తొలి డోసు తీసుకోవటమేంటని అనుకోకండి. గత ఫిబ్రవరినెలలో కేటీఆర్ కు కరోనా సోకగా హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుని బయటపడ్డారు. ఆ కారణంతోనే ఆయన ఇప్పటికి వ్యాక్సిన్‌ ఫస్ట్ డోసు తీసుకోవటం జరిగింది.

ఈ సంద‌ర్భంగా తనకు టీకా వేసిన డాక్టర్‌ శ్రీకృష్ణ, నర్సు కెరినా జ్యోతికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కరోనా విపత్తు వేళల్లో సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన ఆరోగ్య కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి పరిస్థితులు కొంచెం మెరుగవుతున్నాయి. అయితే ఇంతటితో కూల్ అవటానికి లేకుండా మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించటం జరిగింది. కావున ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉండాలని, వ్యాక్సిన్‌ వేయించుకుని వైరస్ ను అంతం చేసే పనిలో తమ భాధ్యతను నిర్వర్తించాలని నిపుణులు కోరుతున్నారు.