Home News బీజేపీ పార్టీ మొత్తానికి గూబ గుయ్యమనిపించిన కేటీఆర్

బీజేపీ పార్టీ మొత్తానికి గూబ గుయ్యమనిపించిన కేటీఆర్

రోజు రోజుకి హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం హీట్ ఎక్కిపోతుంది. ప్రచారంలో దూకుడు చేయించేందుకు తహతహలాడుతున్న నాయకులు ఊపులో ఏది పడితే అది నోరు జారేసి చివరికి అసలుకే ఎసరు తెచ్చేటట్లు ఉన్నారు.నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా బండి సంజయ్ ప్రచారం సందర్భంగా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పాతబస్తీ మీద స ర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని ఆయన హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు వల్ల ప్రయోజనం లేకపోగా తిరిగి తమ పార్టీకే ముప్పు తీసుకొస్తాయి.

ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ… పాతబస్తీ లో రోహింగ్యాలను, పాకిస్తాన్ కొడుకులను తరిమి తరిమి కొడతాం, బీజేపీ బరాబర్ హిందువుల కోసం పోరాడుతుంది అని అన్నారు. దీనిపై కేటిఅర్ స్పందించారు. ఓట్లు, సీట్లు కోసం మైండ్ పోయి ఏదేదో మాట్లాడుతున్నారు అని కేటిఅర్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి గారు మీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఒక కేంద్ర మంత్రిగా మీరు సమర్ధిస్తారా అని కేటిఅర్ తన ట్విట్టర్ లో నిలదీశారు. ఈ వ్యాఖ్యలు దుమారంగా మారాయి.

- Advertisement -

Related Posts

” ఫస్ట్ ఆ ఎన్నికలు , తరవాత ఈ ఎన్నికలు ” ప్రకటించేసిన జగన్, ఎవ్వడైనా సైలెంట్ అయిపోవాల్సిందే !

గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఆయనను ఒక ప్రభుత్వ అధికారి కంటే కూడా...

విజయవాడ దుర్గ గుడికి వెళ్ళే ప్రతీ ఒక్కరికీ సూపర్ గుడ్ న్యూస్

నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో నిన్న జరిగిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానాలు (టీటీడీ), దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కామధేను పూజ (గోపూజ) నిర్వహిస్తున్నారు....

ఆ విషయంలో ఎన్నడూలేనంత కంగారు పడుతున్న వైఎస్ జగన్?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేయటం, జరపలేమంటూ అధికార ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళటం, జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు...

అమ్మో హనుమ విహారి మామూలోడు కాదు , బిగ్ బాస్ 4 ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టాడు.

బిగ్ బాస్ అభిజీత్ కి ఇప్పుడు ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా 2012లో విడుదలైన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో టాలీవుడ్...

Latest News