ఆ విషయంలో ఎంఐఎం పార్టీ మమ్మల్ని మేల్కొలిపింది : కేటిఆర్

తెలంగాణలో ఎంఐఎం పార్టీతో టిఆర్ఎస్ స్నేహం చేస్తున్నది. 2014 ఎన్నికల తర్వాత నుంచి స్నేహం కొనసాగుతున్నది. అసలు ఎంఐఎంతో టిఆర్ఎస్ దోస్తాన్ ఎందుకు చేస్తున్నట్లు? అన్నది చాలా మందికి తెలియదు. ఆ దోస్తాన్ కారణంగానే ఎంఐఎం సిట్టింగ్ స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ ఏరి కోరి మరీ బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నది. మరి ఎంఐఎం తో లంకె ఎట్లా కలిసింది? అసలు మలతబేంటి? మంగళవారం కేటిఆర్ మీడియా చిట్ చాట్ లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. చదవండి.

తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం పై,  ఆ పార్టీ మేనిఫెస్టో పైనా కేటిఆర్ మీడియా చిట్ చాట్ లో స్ట్రాంగ్ సెటైర్ విసిరారు. కోదండరాం పోటీ చేసేదే మూడు సీట్లు, దానికి పైంగా ఆ పార్టీకో మేనిఫెస్టోనా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మహా కూటమి పుంజుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.  డిసెంబరులో కాంగ్రెస్ గూబ గుయ్యుమనడం ఖాయమన్నారు.  కేటిఆర్ ఇంకా ఏమన్నారో కింద చదవండి.

మా నాయకుడు కేసిఆర్ సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. కొన్ని చోట్ల రెండు రౌండ్లు ప్రచారం పూర్తయింది. 105 మంది అభ్యర్థుల ప్రకటన సాహసోపేత నిర్ణయం.. అదే మాకు కలిసొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తులు సెటిల్ అయ్యాయి. ప్రజల అభిప్రాయం టిఆర్ఎస్ వైపు ఏకపక్షంగా ఉంది. 100 సీట్లు గెలుస్తాం. డిసెంబర్ 11న శబ్దవిప్లవం ఉంటుంది.. కాంగ్రెస్ గూబ గుయ్యమంటుంది.

రానున్న 30 రోజులు పరిస్థితుల్లో మార్పు రాదు. సమయం లేదు.. వారి కలయికకు ప్రజల ఆమోదం లేదు. చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేది లేదని ఆయనే చెప్పాడు. తెలంగాణ లో సెటిలర్స్ టిఆర్ఎస్ వైపే ఉన్నారు. టిఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే సీఎం అభ్యర్థి.. కాంగ్రెస్ లో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. నేను సీఎం కావాలనే ఆలోచన లేదు.. హరీష్ రావు కు నాకు ఎలాంటి విభేదాలు లేవు.

కేసీఆర్ మరో పదిహేనేళ్ళ సీఎం గా ఉంటారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఒకే తాను ముక్కలు. జాతీయ పార్టీలు విఫలమైయ్యాయి. ఆంద్రప్రదేశ్ లో ఎం జరిగినా మోడీకి, కేసీఆర్ కు ముడిపెడుతున్నారు. అభద్రతాభావంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. బీజేపీ ఐదు సిట్టింగ్ స్థానాల్లోనూ టిఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. 

రాహుల్, సోనియా ప్రచారంతో ఏదో ఒరిగిపోతుందని అనుకోవటం లేదు. కేసీఆర్ ను చూసి ఓటేస్తామని సామాన్య జనం అంటున్నారు. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించాక మాకు అనుకూలంగా మారుతుంది. 2009 లో మేము పొత్తుపెట్టుకొని దెబ్బతిన్నాం. కాంగ్రెస్, టిడిపికి మధ్య ఓట్ షేర్ కాదు. అభ్యర్థులను మార్చేది లేదు. తెలంగాణ లో కులపిచ్చి లేదు.అది ఆంధ్రాలో మాత్రమే బలమైన అంశం. 2004లో హైదరాబాద్ అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పినా ఒక్క సీటు రాలేదు. 2014 లో మాపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకే గ్రేటర్ లోమాకు సీట్లు రాలేదు. ఆ తర్వాత మా పరిస్థితులు మెరుగుపడ్డాయి కాబట్టే జిహెచ్ఎంసి ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించాం.

ఇటలీ మాఫియా….అనకొండ సోనియా అంటూ చంద్రబాబే గతంలో అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ దత్తపుత్రుడు. 

కాంట్రాక్టర్ల మీద ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు క్యాబినేట్ లో చర్చించటం ఏంటి? చంద్రబాబు ఎందుకో మానసికంగా భయపడుతున్నారు. ఈ దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ లు నాశనం చేసాయి. వంద స్థానాల్లో బిజెపి డిపాజిట్లు గల్లంతే. ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడాలి. బుల్లెట్ రైల్ ఒక్క గుజరాత్ కోసమేనా. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నయ్ కు ఉండదా. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కుంభకోణం జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయాన్ని మాకు చెప్పింది ఎంఐఎం పార్టీనే. ఆ పార్టీ మమ్మల్ని మేల్కొలిపింది. అందుకే మేము ఎంఐఎం తో దోస్తీ చేస్తున్నాం. ముషీరాబాద్, అంబర్ పేట్ లో బలమైన అభ్యర్థులను నిలుపుతాం. బిజెపినీ 5 సీట్లలోనూ ఓడగొడతాం. బిజెపి కి 70 మంది అభ్యర్థులే దిక్కు లేరు…ఇంకా 70 సీట్లు ఎక్కడ గెలుస్తారు. సోనియాగాంధీని ఉద్దేశించి అమ్మనా బొమ్మనా అని ఆవేశంతో అంటే నానా రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నేతలు చంద్రబాబు చేసిన కామెంట్స్ పై ఎందుకు మాట్లాడరు.

చంద్రబాబు మొత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ప్రతినిధి కాదు. కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ది అసాధారణ విజయమేమి కాదు. చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్సార్ సీపీ మాత్రమే. దీపావళి తర్వాత మ్యానిఫెస్టో ప్రకటిస్తాం. మా ఆర్ధిక విధానం ఆదాయం పెంచాలి…పేదలకు పంచాలి. 2014 లొనే కోదండరాం తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు. కూటమి కొత్తదేమి కాదు.

అసంతృప్తులను జిల్లాల్లో మంత్రులే సద్దుమణిగేలా చేశారు. మా పార్టీ అధ్యక్షుడే వారిని బుజ్జగించాలని లేదు. కాంగ్రెస్ హామీల చిట్టా చూస్తే అవి ఆపద మొక్కులే అనిపిస్తున్నాయి. హై కోర్టు విభజన ఎప్పుడో జరగాలి. ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను మ్యూజియంగా మారుస్తారు.