రేవంత్ పిచ్చకుంట్లోడు, 150 కోట్ల స్కాం అంటడా : కేటిఆర్ (వీడియో)

బేగంపేటలో క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటిఆర్ సుదీర్ఘంగా సమీక్ష జరుపుతున్నారు. బతుకమ్మ చీరలపై కేటిఆర్ సమీక్ష. ఈ సమీక్ష సమావేశంలో చేనేత, జౌళి శాఖ అధికారులంతా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేటిఆర్ మాట్లాడుతూ 90లక్షల చీరలు వీలైనంత తొందరగా రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రింబవళ్లు పనిచేసి బతుకమ్మ చీరలు సిద్ధం చేయాలని సూచించారు.

మాటల సందర్భంలో అధికారుల వద్ద కేటిఆర్ ఆగ్రహానికి లోనయ్యారు. అసహనానికి గురయ్యారు. బూతు పురాణం అందుకున్నారు. ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో వాడకూడని భాషలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అనే పిచ్చకుంట్లోడు అంటూ కేటిఆర్ తన అక్కస్సునంతా వెల్లగక్కారు. అన్ పార్లమెంటరీ భాషలో ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిట్టారు. అంతేకాదు  బతుకమ్మ చీరల పంపిణీలో 150 కోట్ల స్కాం జరిగిందని రేవంత్ అంటడా అని రగలిపోయారు.  చీరలు త్వరగా సిద్ధం చేయకపోతే గతంలో మాదిరిగానే ఈ ఏడాాది కూడా మహిళలతో తిట్లు తినాల్సి వస్తదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్వాకం వల్ల మళ్లీ సూరత్ చీరలు తీసుకురావాల్సి వస్తది కదా అన్నారు. ఎలక్షన్ ఇయర్ లో మాకు ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారు. కేటిఆర్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

కేటిఆర్ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడినట్లే అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడారని రాజకీయ నేతలు అనుకుంటున్నారు. పార్టీ సమావేశాలకు, అధికారుల సమీక్ష సమావేశాలకు మధ్య తేడాలేకుండా చేసేశారని సెటైర్లు వేస్తున్నారు. మరి కేటిఆర్ వాడిన భాషకు రేవంత్ ఏరకంగా జవాబు ఇస్తారో చూడాలి. ఎందుకంటే తెలుగు నేల మీద కేసిఆర్ మాట్లాడే భాషలోనే రేవంత్ అంతకంటే ఎక్కువగా మాట్లాడే వ్యక్తి. ఇక రేవంత్ ను పిచ్చకుంట్లోడు అంటూ కేటిఆర్ సంబోధించడంపై రేవంత్ అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత స్పందించే చాన్స్ ఉంది.