Home Telangana కేసిఆర్ ఫ్యామిలీకి నవాజ్ షరీఫ్ కు పట్టిన గతే : కోమటిరెడ్డి

కేసిఆర్ ఫ్యామిలీకి నవాజ్ షరీఫ్ కు పట్టిన గతే : కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ నల్లగొండ మీటింగ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగానే సాగింది. వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ నేతలు ఎట్టకేలకు యూనిటీ చూపించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో పార్టీ నేతలు బాగానే ఐక్యతారాగం ఆలపించారు. సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సిఎం కేసిఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు.

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు, ఆయన కూతురుకు పట్టిన గతే కేసిఆర్ ఫ్యామిలీకి పడుతుందన్నారు. కేసిఆర్ ను, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడును జైలకు పంపుతానని వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలో రికార్డులన్నీ తుడిపేస్తు నల్లగొండ పార్లమెంటు సీటును 5లక్షలకు పైగా మెజార్టీతో గెలిపించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. అహంకారంతో మదమెక్కి కేసిఆర్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్న కేసిఆర్ ను ఇక భరించే స్థితిలో జనాలు లేరన్నారు.

కేసిఆర్ మాటలు చూస్తుంటే ఎప్పుడు ఈ సర్కారును గద్దె దింపాల్నా అన్న కసి పెరుగుతున్నదన్నారు. నకిరేకల్ లో పది ఇరవై మంది జాయిన్ అయితే కేటిఆర్ ఏమేమో మాట్లాడుతున్నడని ఎద్దేవా చేశారు. కేటిఆర్ మాటలు చూస్తుంటే ఆయన ఏడ చదువుకున్నడో అమెరికాలో చదివిండా లేదా అర్థమైతలేదన్నారు. కనీస ఇంగితం లేకుండా కేటిఆర్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

Chirumarthy Lingaiah Abhimanasena ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಭಾನುವಾರ, ಜುಲೈ 15, 2018

మంత్రి జగదీష్ రెడ్డిపైనా కోమటిరెడ్డి వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి నల్లగొండ సభలో మాట్లాడిన ఫుల్ వీడియో పైన ఉంది చూడండి.

- Advertisement -

Related Posts

కేటీఆర్ సీఎం కాబోతున్నారు.. ఇదిగోండి ప్రూఫ్ 

తెరాసలో ఎన్నాళ్ళ నుండి ముఖ్యమంత్రి మార్పు విషయమై సమగ్ర చర్చ నడుస్తూనే ఉంది.  కేసీఆర్ నెలలో ఎక్కువ రోజులు ఫామ్ హౌస్లోనే  గడుపుతుండటంతో తనయుడు, మంత్రి కేటీఆరే పార్టీ, పాలన బాధ్యతలను చూసుకునేవారు.  హోదాకు...

కాళేశ్వ‌రం ముక్తేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో సీఎం కేసీఆర్ పూజ‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిశీలన కోసం కాళేశ్వరం చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళవారం ఉదయం బయల్దేరారు. కాళేశ్వరం చేరుకుని నేరుగా కాళేశ్వర , ముక్తేశ్వర స్వామివార్ల...

జానారెడ్డి గెలవాలంటే రేవంత్ రావాల్సిందేనా..? ఆసక్తికరంగా సాగర్ రాజకీయం

 తెలంగాణలో మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ చాలా సీరియస్ గా తీసుకోని సిద్ధం అవుతున్నాయి. అది తెరాస కు సిట్టింగ్ స్థానమైన కానీ,...

శంషాబాద్ ఎయిర్‌పోర్టు ర‌న్ వేపై పులి … అప్రమత్తమైన సిబ్బంది

తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పులి సంచారం కలకలం రేపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పులిని చూశామంటూ రైతలు, స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో...

Latest News