బ్రేకింగ్ : ఖమ్మం టిఆర్ఎస్ లో కొత్త చిచ్చు (వీడియో)

ఖమ్మం టిఆర్ ఎస్ లో అసమ్మతి కలకలం రేగింది. సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన టిఆర్ ఎస్ నేత డాక్టర్ మట్టా దయానంద్ సెల్పీ వీడియో తీసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పిన వీడియో ఇప్పుడు టిఆర్ ఎస్ లో కలకలం రేపుతోంది.

సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన మట్టా దయానంద్ 2014 ఎన్నికల్లో వైసిపి నుంచి పోటి చేసి సండ్ర వెంకట వీరయ్య చేతిలో కేవలం 2000 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత  ఆయన టిఆర్ ఎస్ లో చేరారు. ఈ సారి సత్తుపల్లి టికెట్ వస్తుందని ఆశించినా ఆ సీటు ఓయూ జెఏసీ నేత పిడమర్తి రవికి కేటాయించారు. దీంతో కేటిఆర్, కేసీఆర్ లు తనకు సీటు రావాల్సి ఉన్నా పరిస్థితుల బట్టి మార్చాల్సి వచ్చిందని రవికి సపోర్ట్ చేయాలనడంతో పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తున్నానన్నారు. కొంత మంది పనిగట్టుకోని కేటిఆర్ దగ్గర రూ.7 కోట్ల రూపాయలు తీసుకొని లాలూచి పడ్డానని అసత్య ప్రచారం చేన్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయానంద్ విడుదల చేసిన వీడియో కింద ఉంది చూడండి. పిడమర్తి రవి వర్గీయులే కావాలని ఆరోపణలు చేస్తున్నారని దయానంద్ వర్గీయులు ఆరోపించారు.

 

 

khammam trs dayanandh selfie video