వైభవంగా ఖైరతాబాద్ గణనాధుని శోభాయాత్ర (వీడియో)

నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడిలో ఒదిగేందుకు సిద్ధమయ్యాడు. ఈరోజు ఉదయం ఖైరతాబాద్‌ నుంచి ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర కొద్దిసేపటి క్రితం ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. గణనాధుని శోభాయాత్ర వీడియో కింద ఉంది చూడండి.

57 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు గల శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతిని భారీ క్రేన్‌పైకి చేర్చారు. పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మహాగణపతిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.

ఉదయం 7 గంటల సమయంలో ప్రారంభమైన శోభాయాత్ర లక్డీకాపూల్‌, టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. విజయవాడలోని ఓ సంస్థకు చెందిన భారీ వాహనంపై బొజ్జ గణపయ్య ఊరేగింపుగా తరలివచ్చాడు.

70 అడుగుల పొడవు.. 12 అడుగుల వెడల్పు కలిగిన ‌26 చక్రాల లారీ మహాగణపతిని సాగర తీరానికి ఈ తీసుకొచ్చింది. 49 టన్నుల బరువు మోయగల సామర్ధ్యం ఈ ట్రాలీ కి సొంతం. మహాగణపతి నిమజ్జన ప్రక్రియ తిలకించేందుకు నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.