కెసిఆర్ కి మేనల్లుడే దిక్కు అవుతున్నాడా?అందుకేనా ఆ పదవి?

kcr wants to elect harish rao as working president of trs party

తెలంగాణ: 2014 నుంచి వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చిన కెసిఆర్ హవాకు ఒక్కసారిగా దుబ్బాక ఉపఎన్నికలు బ్రేక్ వేశాయి.ఆ వెంటనే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ముందుగా అంచనా వేసిన దానికంటే అతి తక్కువ స్థానాలు దక్కాయి.దీంతో వాస్తవం ఏమిటనే విషయం తెలుసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారు.తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, ప్రజల మద్దతు తమకి ఎప్పుడూ ఉంటుందని, తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు మళ్ళీ మళ్ళీ అధికారంలోకి తీసుకు వస్తాయనే భ్రమలు కేసీఆర్ కు, ఆ ఆ పార్టీ నాయకులలోనూ తొలగిపోయాయి.

kcr wants to elect harish rao as working president of trs party
kcr wants to elect harish rao as working president of trs party

దీనికితోడు కెసిఆర్ లో కనిపించే కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారడంతో, టిఆర్ఎస్ ఊహించని విధంగా ఎన్నో దెబ్బలు తినాల్సి వచ్చింది.ఇప్పుడు మరిన్ని నష్టాలు చోటు చేసుకోక ముందే పార్టీని ఒక గాడిలో పెట్టి ప్రభుత్వానికి ఎటువంటి లేకుండా ఇబ్బంది లేకుండా చేసుకునే విషయం పై కేసీఆర్ దృష్టి సారించారు.అందుకే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే ఉద్దేశంతో తన మేనల్లుడు తెలంగాణ మంత్రి ‘హరీష్ రావు’ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసి పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు.

మొదట్లో కెసిఆర్ హరీష్ రావు పెద్దగా పట్టించుకోనట్టుగా కనిపించారు.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడత మంత్రివర్గ విస్తరణ లో హరీష్ రావు కు చోటు కల్పించలేదు.అయినా ఎక్కడా అసంతృప్తికి గురి కాకుండా హరీష్ పార్టీకి మేలు చేస్తూ వస్తున్నారు.ఇప్పుడు అటువంటి నాయకులను దూరం పెట్టుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఆయనకు ఆ పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా, ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు అనే విషయాన్ని గుర్తించి వారికి క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారు.క్షేత్రస్థాయిలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా, ప్రజలలో టిఆర్ఎస్ బలం పెరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు.