కేసీఆర్ గుండెల్లో భయం… గ్రేటర్ ఎన్నికల్లో ఫలితం తారుమారు అయితే?

kcr very much worried about the result of Ghmc elections

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలో వేసుకుని మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేస్కుని అందరం కలిసి పరిపాలించుకుందాం అంటూ వరుసగా రెండు సార్లు సీఎం అయ్యాడు. కొందరకి ఆయన వైఖరి నచ్చకపోయిన ప్రత్యామ్నాయం లేక ఎదురులేకుండా పరిపాలన సాగిస్తున్నాడు. సరైన ప్రతిపక్షం లేకపోవడం,ఉన్న వారిలో సరైన పోటీ ఇచ్చే నాయకులు లేకపోవడంతో ఎదురే లేకుండా అంతా మేమే అన్నట్లుగా ముందుకు వెళ్తు ఉన్నాడు. కొత్త ఎప్పటికైనా పాతపడటం సాధారణ విషయమేగా, అలానే కెసిఆర్ మీద ఆయన పార్టీ మీద వ్యతిరేకత కొంచెం కొంచెం పెరుగుతు ఉన్న సమయంలో కొంతమంది నాయకులు ఈ గ్యాప్ లో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు, వారిని ఢీ కొట్టే సత్తా తమలో ఉందని ప్రజల్లో నమ్మకాన్ని తీసుకు రాగలిగారు.

kcr very much worried about the result of Ghmc elections
KCR very much worried about the result of Ghmc elections

కరోనా విషయంలో కేసీఆర్ పాటించిన మరియు తీసుకొన్న చర్యల వలన ఆయనకీ ప్రజలకి మధ్య దూరం పెరిగిపోయిందని చెప్పొచ్చు.. అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తన దూకుడు పెంచడంతో కేసీఆర్ కి కొంత తలనొప్పి మొదలైనమాట వాస్తవం.. ప్రతి దానికి లెక్క అడుగుతూ ప్రజల తరపున అడుగుతున్నామని చెప్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.. దీనికి దుబ్బాక ఫలితం కూడా తోడయ్యి కేసీఆర్ ని మరింత ఇబ్బంది పెట్టేస్తున్నారు బీజేపీ నేతలు.. దుబ్బాక లో వచ్చిన ఉత్సాహంతో బీజేపీ గ్రేటర్ గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది..

అయితే బీజేపీ దూకుడు ను చూసి కేసీఆర్ లో కొంత భయం మొదలయిందని చెప్పొచ్చు.. గతంలో ఎన్నడూలేనంతగా కేసీఆర్ పై వారు తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చారు.అంతేకాదు ఇన్నాళ్లు కుక్కిన పేనుల్లా పడి ఉన్న సొంత పార్టీ నేతలు కూడా ఇప్పుడు స్వరం పెంచుతున్నారట.ఇదే కొనసాగితే పార్టీ లో అసంతృప్తి నేతలు ఎక్కువై పార్టీ రాజకీయ భవిష్యత్ పై ప్రభావం పడేలా ఉంటుందని గ్రేటర్ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి వీటన్నిటికీ సమాధానం చెప్పాలని చూస్తున్నారట. అందుకే అభ్యర్థుల జాబితాను కూడా దగ్గరుండి పరిశీలించారు. అసంతృప్తిని ఎదుర్కొంటున్న కార్పొరేటర్లకు తిరిగి టిక్కెట్ ఇవ్వలేదు. ఇప్పటి వరకూ బీజేపీపై కొంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్న కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం అలా చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్నారు.జీహెచ్ఎంసీ ఎన్నికల విజయం కేసీఆర్ కు తప్పనిసరి లేదంటే పార్టీ పతనం ఇప్పటి నుండి మొదలవుతుందని చెప్పొచ్చు .