తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్?

తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్?

తెలంగాణ ప్రాంత వాసుల సుదీర్ఘ కల తెలంగాణ రాష్ట్రం. అది 2004 సంవత్సరంలో సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది? కెసిఆర్ పోరాటం వలన? లేక కాంగ్రెస్ ఇచ్చిందా?? అంటే రెండూ కూడా నిజం కేసీఆర్ సాధించాడు కాంగ్రెస్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి మరియు కాంగ్రెస్ ముఖ్యమైన రాజకీయ పక్షాలు గా నిలబడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం చేపట్టడానికి కావలసిన సీట్లు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ గౌరవప్రదమైన స్థానం కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. అయితే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గా చంద్రశేఖర రావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లో కి లాక్కోవడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల కి కాంగ్రెస్ తన శక్తినంతా కూడదీసుకుని అధికారం వైపు పరిగెత్తడానికి ప్రయత్నించింది అయితే అనేక కారణాల వలన గతం కంటే తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కెసిఆర్ కు మాత్రం గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేకపోవడంతో ఇక మీదట పార్టీ ఫిరాయింపులు ఆపుతాడేమో అని అందరూ భావించారు. కానీ ఎలక్షన్ ముగిసిన రెండవ రోజు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఫిరాయించడం ప్రారంభించారు. కాంగ్రెస్ తరఫున 19 మంది గెలిచిన అందులో సుమారు 12 మంది టిఆర్ఎస్ లో చేరడం జరిగింది. ఈ 12 మంది ఈ మధ్యనే స్పీకర్ను కలిసి మేమే నిజమైన కాంగ్రెస్ శాసనసభా పక్షం అని మమ్మల్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనివలన కాంగ్రెస్ ప్రతిపక్షం అనేది లేకుండా పోతుందని ఇది కేసీఆర్ భావన కావచ్చు.

అయితే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బిజెపి ఎక్కువ సీట్లు సాధించింది. కాంగ్రెస్ 3 ఎంపీ స్థానాలు గెలిస్తే బిజెపి 4 ఎంపి స్థానాలు గెలిచింది. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే కాంగ్రెస్కు ఓటు వేసి ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటే  వారు మరుసటి రోజే టిఆర్ఎస్లోకి ఫిరాయిస్తున్నారు. కాబట్టి ఓటర్లు బీజేపీ వైపు చూడటం స్టార్ట్ చేశారు. ఈ పరిస్థితి ముందు ముందు టిఆర్ఎస్ కి పెద్ద ప్రమాదమే సృష్టించే అవకాశం ఉంది.

ఎప్పటికైనా టిఆర్ఎస్ కి ఎలక్షన్ రాజకీయాలలో కాంగ్రెస్ ని ఎదుర్కోవడం చాలా సులభం ఎందుకంటే కాంగ్రెస్ లో అనేక గ్రూపులు, వెన్నుపోట్లు. ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కావాలని ఒక కోరిక. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పార్టీ ఏకతాటిపై పోరాడి కేసీఆర్ పై గెలవడం అంత సులభం కాదు. రేపటి రోజున బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించినప్పుడు బిజెపి క్రమశిక్షణకి పెట్టిన పేరు అలాంటి పార్టీతో ఎన్నికలలో తలపడడం కంటే కేసీఆర్కి కాంగ్రెస్ ని తన ప్రత్యర్థి గా ఉంచుకోవడం ఎప్పటికైనా మేలు చేస్తుంది.

తెలంగాణ లాంటి సమాజంలో బీజేపీ లాంటి పార్టీకి ప్రజల మధ్య ఒక స్పష్టమైన డివిజన్ సృష్టించడం చాలా సులభం అవుతుంది. ఎప్పుడైతే ఓటర్లు మత ప్రాతిపదికన విడిపోతారు అప్పుడు బిజెపి ని ఎదుర్కోవడం కేసీఆర్ కి అంత సులభం కాదు. కాబట్టి కేసీఆర్ ఇప్పటికైనా కాంగ్రెస్ ఫిరాయింపులకు స్వస్తి పలకాలి.