కంటి చికిత్స కోసం కెసియార్ ఢిల్లీ ఎందుకు వెళ్తారు?

కెసియార్ కంటి చికిత్సకోసం ఆ మధ్య రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్లారు.

ఇది చాలా ఆశ్చర్యమేసే విషయం.

ఎందుకంటే, ఢిల్లీ వైద్యానికి పేరు కాదు.వైద్యానికి పేరంటే దక్షిణ భారత దేశమే. అందులో కూడా హైదరాబాద్ కు మరీ మంచిపేరుంది. 

ఢిలీ అంటే రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు.  ఢిల్లీ అంటే అధికారం, అధికార దుర్వినియోగం. ఢిల్లీలో పెద్ద వైద్య సంస్థలేవీ లేవు. ఎఐఐఎంఎస్, రామ్మమనోహర్ లోహియా ఆసుపత్రులు విఐపిలకు పనికొచ్చే ప్రాధమిక చికిత్సా కేంద్రాలే. ఢిల్లీలో అంతమంచి వైద్యం అందుబాటులో ఉంటే, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రికార్ క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా ఎందుకు వెళ్లారు? మరో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ చికిత్స కోసం లండన్ ఎందుకు వెళ్తారు? నిర్భయ బతికించేందుకు సింగపూర్ ఎందుకు తీసుకువెళ్లారు?

నిజానికి వైద్యమంటే హైదరాబాదే. ముఖ్యంగా కంటి చికిత్సకోసం హైదరాబాద్ పెట్టింది పేరు. చాలా రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు హైదరాబాద్ ఎల్ వి ప్రసాద్ ఇన్ స్టిట్యూట్ కు వస్తారు. ఆఫ్రికా, గల్ఫ్, ఫార్ ఈస్ట్ దేశాలను చికిత్సకు హైదరాబాద్ వస్తుంటారు. ఒకవైపు హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ చేస్తామని, గ్లోబల్ సిటి చేస్తామని చెబుతూ చిన్న కంటి ఆసుపత్రికి కెసియార్ ఢిల్లీ వెళ్తడమంటే హైదరాబాద్ అవమానించడమే!

హైదరాబాద్ లోని  సరోజిని కంటి ఆసుపత్రిలో  ప్రఖ్యాత నేత్రవైద్యులున్నారు. ఇక్కడి  ఎల్ విప్రసాద్ ఇన్స్టి ట్యూట్ కు ప్రపంచ ఖ్యాతి ఉంది. పలు ప్రయవేటు కంటి ఆసుప్రతులున్నాయి. నిజానికి ఆయన ఇక్కడే ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ ను మెడికల్ హబ్ చేసేందుకు దోహదపడి ఉండాలి.

అయినా సరే,  కెసియార్ కన్నుచికిత్స పేరుతో ఢిల్లీ వెళ్లారు. ఆయన ఆపరేషన్ చేయించుకున్న డాక్టర్ సచ్ దేవా అసుపత్రి ఎల్ వి ప్రసాద్ ఇన్ స్టిట్యూట్ కంటే మేలైనదేం కాదు. అయినా డిల్లీకి  ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు… ఎందుకు అని చాలా కాలంగా ఒకప్రశ్న వినపడుతూ ఉంది. ఇది  మామూలు మనుషులకు అర్థమయ్యే విషయం కాదు. ఇందలో ఏదో రాజకీయం ఉందని మీడియా వాళ్లు  ఆ మధ్య  అనుమానించారు తప్ప, అసలు విషయం బయటపడలేదు. ఇపుడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు విషయం చెప్పారు.

 

ఉత్తమ్ ఏమన్నారో చూడండి.

“కేంద్ర కార్మిక మంత్రిగా కేసీఆర్‌ అక్రమానకి పాల్పడ్డారు. అది ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎ్‌సఐ) ఈఎస్ ఐ కార్యాలయం నిర్మాణానికి సంబంధించిన భారీ కుంభకోణం అది. ఈ నిర్మాణం పనిని అప్పగించేందుకు కెసియార్ అన్ని నియమాలను ఉల్లంఘించారు. కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ,అక్కడ ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలు ఉన్న ఆ కాంట్రాక్టును ఆ కంపెనీలకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్‌ డిపార్ట్ మెంటుకు. ఆ డిపార్టమెంట్ కు ఒక కుంభకోణాల ఇఇ ఉన్నాడు. ఆయనెవరో కాదు వెలుగుబంట్ల సూర్యనారాయణకు. ఎక్కడి కేంద్రం, ఎక్కడి ఆంధ్రా ఫిషరీష్ డిపార్ట్ మెంట్. వెలుగు బంటు పై అప్పటికే చాలా ఆరోపణలున్నాయి. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ నిబంధనలను గాలికొదలేసి, నామినేషన్‌ పద్ధతిలో ఆ కాంట్రాక్టును సూర్యనారాయణకు అప్పగించారు.మొదట ఈ కాంట్రాక్టును కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఇచ్చారు. అయితే, కెసియార్ మంత్రిగా చక్రం తిప్పారు. ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ అధికారులను తన ఇంటికి పిలిపించుకుని వారిపై ఒత్తిడి తీసుకొచ్చి, ఆ కాంట్రాక్టు ను రద్దు చేసి సూర్యనారాయణకు ఇప్పించారు. ఇది అక్రమమని తేలింది. సిబిఐ దర్యాప్తు కు వెళ్లింది. సీబీఐ కోర్టులో చార్జిషీటు దాఖలయింది. ఆ చార్జ్ షీట్ లో ఈ విషయాలున్నాయి. కేసీఆర్‌పై ఆ కేసు సీబీఐ కోర్టులో నడిచింది. సిబిఐ వాళ్లు కెసియార్ ను కూడా కలిశారుు. ఈ లోపు ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది. ఆయన పేరును చార్జిషీటు నుంచి తొలగించుకున్నారు. వాస్తవానికి, ఆ కేసులో ఏ-1గా కేసీఆరే ఉండాలి. కంటి పరీక్షల పేరుతో కేసీఆర్‌ తరచూ ఢిల్లీకి వెళ్లేది ఈ కేసు గురించి ప్రధాని మోదీ, ఇతర పెద్దలను బతిమిలాడేందుకే. కేసీఆర్‌ను మోదీ ఎందుకు కాపాడారు. ఇది కెసియార్ ఢిల్లీ కంటి చికిత్స రహస్యం. పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దీని వెనక మతలబు సిబిఐ కేసునుంచి బయటపడటమే. మోదీ, కేసీఆర్‌ బంధాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మోదీ కోసం ఇపుడాయన ఏమయినా చేస్తారు. ఫెడరల్ ఫ్రంట్ కూడా బిజెపిని, మోదీని గట్టెక్కించేందుకే.”