శ్రీరాముడిగా ప్రత్యక్షమయిన ముఖ్యమంత్రి కెసియార్

కెసిఆర్ ని పోరాటయోధుడిగా నే చూస్తారు. ఆయన కూడా తొలినుంచి తనను ఉద్యమనేతగానే చెప్పుకున్నారు. అందుకే  ఆయనను పౌరాణిక పురుషుడిగా ఎవరూ ఎక్కడ కీర్తించలే. అయితే, ఇపుడు  ప్రగతి నివేదన సభ సందర్భంగా తేళ్ల రమేష్ అనే టిఆర్ ఎస్ నాయకుడు తొలిసారిగా కెసియార్ ను రాముడి అవతారం లో చూపించారు.  తేరుపల్లి రమేశ్ శంషాబాద్ టిఆర్ ఎస్ మండలాధ్యక్షుడు. చేతిలో విల్లు వీపును ఒరలో బాణాలతో రాముడిగా కెసియార్ ను చిత్రీకరిస్తూ  వేసి ప్లెక్స్ బోర్డు పెట్టి ఆయన సభకు వస్తున్నవారికి స్వాగతం పలికారు. ఇది కొంతపుంత. కెసియార్ ని దేవుడిని చేసే ప్రక్రియ మొదలయింది. ఆయనకొక గుడి కూడా వెలిసింది. ఈ రోజు ఆయన రామావతారం కటౌట్ లో ప్రత్యక్షమయ్యారు. ఈ కటౌట్‌లో కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ఫోటోలను ప్రదర్శించారు.  ప్రగతి నివేదన సభకు తరలిరండి అని  టీఆర్‌ఎస్ నాయకుడు తేరుపల్లి రమేష్ స్వాగతం పలికారు.

అయితే, కెసియార్ ను ఇలా రాముడిగా చిత్రీకరించడానికి సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.