కవిత గారి ఎమ్మెల్సీ గెలుపు లాంఛనమే… అసలు టార్గెట్ మంత్రి పదవేనా?

kcr plaanning more for kavitha

కెసిఆర్ కుమార్తె అయిన కవిత గత ఎన్నికల్లో ఎంపీగా ఓటమి పాలైన తర్వాత డీలా పడ్డ ఆమె.. ఇప్పుడు హుషారుగా ఉన్నట్లు చెబుతున్నారు. కుమార్తెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి.. ఉప ఎన్నికల బరిలో నిలపటం ద్వారా ఆమెను ఎమ్మెల్సీ చేస్తున్న కేసీఆర్.. రానున్న రోజుల్లో ఏం చేయనున్నారు? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీస్తోంది.పోలింగ్ సరళిని చూస్తే.. బరిలో ఉన్న కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గెలుపు లాంఛనమే కావటంతో ఇప్పటికే కవితకు అందరూ కంగ్రాట్స్ చెప్పేస్తున్నారట.

kcr plaanning more for kavitha
kcr & kavitha

రెండు రోజుల క్రితం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పూర్తి కావటం తెలిసిందే. ఓటర్లలో ఒక్కరు తప్పించి మిగిలిన అందరూ ఓటు వేయటం.. ఆ ఓటు ఉన్న స్థానిక నేత మరణించటంతో ఓటు వేయలేకపోవటం తెలిసిందే. పోలైన ఓట్లతో 90 శాతం వరకు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు పడినట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా జరిపిన లాబీయింగ్ తో భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పటికిప్పుడు మంత్రి పదవి అప్పజెప్పే అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం తెలంగాణ అసెంబ్లీలో సీఎంతో పాటు పద్దెనిమిది మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు ఉండాలి. ఇప్పటికే అందరూ ఉండిపోవటంతో.. ఎవరో ఒకరు తమ పదవిని త్యాగం చేస్తే తప్పించి కవితకు అవకాశం లభించేది లేదు. ఒకవేళ.. అలా త్యాగం చేసినా.. ఆమె పదవీ కాలం 14 నెలలు మాత్రమే ఉంది.

ఒకవేళ.. తర్వాత కూడా ఆమెను మరోసారి బరిలోకి దింపుతారని చెబుతున్నా? అది అనుమానమేఅంటున్నారు. ఎందుకంటే.. ఎంపీగా పని చేసిన అనుభవం ఉన్న ఆమె.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఢిల్లీ మీదనే ఉందంటున్నారు. అందుకే.. మంత్రి పదవికి అవకాశం తక్కువ ఉందంటున్నారు. అయితే.. కాబోయే మంత్రి అంటూ బోధన్ ఎమ్మెల్యే షకీల్..మరో ఎమ్మెల్యే గణేష్ గుప్తా లాంటి వాళ్లు కామెంట్లు చేస్తున్నా.. కేసీఆర్ ఆ నిర్ణయాన్ని తీసుకుంటారా? అన్నది క్వశ్చన్.

ప్రస్తుతానికి మంత్రి పదవి ఇవ్వకుండా కీలకమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇదేమీ కాదు.. మండలిలో విప్ గా నియమించే వీలుందని.. దానికి ఆమె సరిగ్గా సరిపోతారన్న ప్రచారం సాగుతోంది. ఏమైనా.. పరిమిత కాలానికి ఎన్నికైన కవితకు ఎలాంటి పదవీ బాధ్యతల్ని సీఎం కేసీఆర్ అప్పగిస్తారు? అన్నది ప్రశ్నగా మారింది