ఇంటికి వెళ్లి మండవను టిఆర్ ఎస్ లోకి ఆహ్వానించిన కెసిఆర్

తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో మిగిలిపోకిన కమ్మ నాయకులందరిని ముఖ్యమంత్రి కెసిఆర్ మచ్చిక చేసుకుంటున్నారు. ఈ విషయం మీద ఆయన ఎంత శ్రద్ద వహిస్తున్నారంటే, స్వయాన తానే రంగంలోకి దిగి వారిని పార్టీ లోకి ఆహ్వనిస్తున్నారు. తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించేందుకు ముఖ్య మంత్రి ఈ రోజు ఆయన ఇంటికి వెళ్లి అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తారు.

జూబ్లీహిల్స్‌ గాయత్ని ఎస్టేట్స్ లోని మండవ నివాసానికి స్వయంగా వెళ్లిన సీఎం కేసీఆర్‌ సుమారు గంట సేపు ఆయన తో మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాల పరిణామాలపైనా, రాష్ట్రాభివృద్ధి పైనా వారు చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశానికి శుక్రవారం ఉదయం నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి.

తెరాస ఎమ్మెల్యేలు తెలంగాణ కమ్మ పెద్దలు మాగంటి గోపీనాథ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ ముందు మండవతో సంప్రతింపు జరిపారు.

పార్టీలోకి వచ్చి కెసిఆర్ నిర్మిస్తున్న బంగారు తెలంగాణలో పాలు పంచుకోవాలని కోరినట్లు, దానికి మండవ కూడా అంగీకరించినట్లు సమాచారం.


టిఆర్ ఎస్ లో చేరడానికి మండవ సుముఖంగా ఉండటంతో పార్టీలోకి గౌరవ ప్రదంగా ఆహ్వనించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా మండవ ఇంటికి వెళ్ళారు.

దీని మీద త్వరంలో మండవ అధికారికంగా ప్రకటన చేస్తారు.

మంత్రిగా, ఎమ్మెల్యేగా మండవకు ఉన్న సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే, టిడిపి తెలంగాణలో కష్టాల్లో పడినప్పటినుంచి ఆయన పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడం మానేశారు.

మండవ నిజామాబాద్‌లో గట్టి పట్టున్ననాయకుడు. మండవ చేరిక ముఖ్యమంత్రి కూతరు, సిటింగ్ ఎంపి కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో బాగా ఉపయోగపడుతుంది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎలాగూ ఇక రాదని, అందువల్ల ఆపార్టీలో ఉన్న ఓటర్లను తెలంగాణ రాష్ట్ర సమితి వైపు తిప్పుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆయర్ చేస్తున్న ప్రయత్నంలో భాగాంగానే ఈ రోజు మండవ ఇంటికి ఆయన వెళ్లారు.

తెలుగుదేశం నాయకులు టిఆర్ ఎస్ లోకి వస్తే వారికి సముచిత గౌరవం ఉంటుందని చెప్పడమే ఈ రోజు సమావేశం ఉద్దేశం.

ఈ మధ్యన ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కమ్మ ప్రముఖుడు నామా నాగేశ్వరరావు టిఆర్ ఎస్ లో చేరడమే కాదు, ఖమ్మం లోక్ సభ స్థానానినిక పార్టీ అభ్యర్థి అయ్యారు.