కాంగ్రెస్,బీజేపీ నేతలకు… తొక్కి పడేస్తానంటూ కేసీఆర్ వార్నింగ్

kcr gave deadly warning to congress, bjp leaders

నల్గొండ జిల్లా హాలియాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్… తొక్కి పడేస్తా జాగ్రత్త అంటూ ప్రతిపక్షాలను హెచ్చరించారు. జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ త‌ర్వాత హాలియాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్,బీజేపీ నేతలను మాటలతోనే తాట తీశారు. కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

kcr gave deadly warning to congress, bjp leaders
kcr gave deadly warning to congress, bjp leaders

ఇక బీజేపీ నేతలు ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్నట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ విమర్శించాడు. వాళ్లలా మాట్లాడాలంటే తమకు చేతకాక కాదని… తాము తలుచుకుంటే కాంగ్రెస్ మిగలదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సూచించారు. హద్దు మీరినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసన్నారు. తొక్కిపడేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు తమను ఇష్టపడి తీర్పునిచ్చారని… ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదని కాంగ్రెస్ బీజేపీలను కేసీఆర్ కడిగేశారు.

తెలంగాణలో ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్ నేతలు కాదా అన్నారు. ”తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని కిరణ్కుమార్ అన్నాడు.. ఆనాడు ఒక్క కాంగ్రెస్ నేత అయినా మాట్లాడారా? అని కేసీఆర్ నిలదీశాడు. కమీషన్ల కోసమే ప్రాజెక్ట్లు కట్టామని మాట్లాడుతున్నారు.. మీరు నాగార్జునసాగర్ కమీషన్ల కోసమే కట్టారా? అని కేసీఆర్ నిలదీశారు. దేశంలోనే అత్యధిక వరిని పండించి ఎఫ్సీఐకి ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని.. అది తమ ఘనత అన్నారు.