నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ప్లాన్ మార్చిన కేసీఆర్!

kcr change his plans for nagarjuna sagar by-elections

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి కెసిఆర్ చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్టుగా నడిచిపోతూ ఉంది. రాష్ట్రంలో గడిచిన ఆరేళ్లుగా ఎక్కడ ఎలాంటి ఎన్నిక జరిగిన టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది . అసెంబ్లీ.. పార్లమెంట్.. మున్సిపల్.. కార్పొరేషన్.. పంచాయతీ.. సహకార.. ఇలా ఏ ఎన్నిక తీసుకున్న కారు జెడ్ స్పీడుతో దూసుకెళ్లేది.ఇదంతా దుబ్బాక ఉప ఎన్నిక జరుగక ముందు సీన్.. ఎప్పుడైతే దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందో ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడింది. ఆ వెంటనే వచ్చిన జీహెచ్ఎంలోనూ టీఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది.

kcr change his plans for nagarjuna sagar by-elections
kcr change his plans for nagarjuna sagar by-elections

ఈ రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీలోకి ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ఇక త్వరలోనే నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరుగనుండటంతో టీఆర్ఎస్.. బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్ నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికల్లో సత్తాచాటి తెలంగాణలో తమకు ఎదురులేదని నిరూపించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ పక్కా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

ఎన్నికల లోపు నాగార్జున్ సాగర్లో 100కోట్ల పనులు చేపట్టేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ నేపథ్యంలో ఈసారి నోముల నర్సింహాయ్య కుటుంబానికి కాకుండా ఆ ప్రాంతంలోని బలమైన రెడ్డి వర్గానికి సీటు కేటాయించాలని భావిస్తున్నారని టాక్.కాంగ్రెస్ నుంచి జనారెడ్డి పోటీ చేయనని స్పష్టం చేశాడు. అయితే అతని కుమారుడి రఘువీర్ కు బీజేపీ.. టీఆర్ఎస్ లు గాలం వేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి రఘువీర్ పోటీ చేస్తారా? లేదా అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.రఘవీర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వస్తే అతడికే టికెట్ కేటాయించేందుకు సీఎం సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఆ ప్రాంతంలోని బలమైన రెడ్డి వర్గానికే సీటు కేటాయించే అవకాశం ఉందని టాక్ విన్పిస్తోంది.