సాగర్ లో కాంగ్రెస్ జానారెడ్డి ఉగ్రరూపం (వీడియో)

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓ కార్యకర్త పై ఆగ్రహానికి గురయ్యారు. చాలా సౌమ్యునిగా పేరున్న జానారెడ్డి కోపంలో నోరు జారాడు. నాగార్జున సాగర్ నుంచి పోటి చేస్తున్న జానారెడ్డి తిరుమలగిరి సాగర్ మండలం నాగార్జున తండాలో బుధవారం ప్రచారం చేస్తుండగా ఇన్ని సార్లు గెలిచినా ఏం చేశావని వారు ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన జానారెడ్డి తన నోటికి పని చెప్పారు.

జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. తాను హోం మంత్రిగా పని చేసినప్పుడు కూడా ఏదైనా మంచి చెప్పేది ఉంటే బాగా చెప్పేవాడు. ప్రభుత్వం పై వ్యతిరేకత భావాలు ఉన్న విషయాన్ని మాట్లాడేటప్పుడు మాత్రం రిపోర్టర్లను సైతం కన్ఫిజ్ చేసి ఏం మాట్లాడేవాడో ఆయనకే తెలిసేది కాదు. ఎప్పుడు కూడా మాట తూలకుండా జాగ్రత్త పడేవారు. సీఎం కేసీఆర్ సైతం జానా రెడ్డి అనుభవం, ఆయన నిబద్దతకు విలువిచ్చి పెద్దలు జానారెడ్డి అని పిలిచేవారు. ఇదంతా జానారెడ్డికి ఒక కోణం వైపు మాత్రమే  జానారెడ్డి  మరోక కోణం కూడా ఎన్నికల ప్రచారంలో బుధవారం బయటపడింది.

జానారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ నాగార్జున తండాకు చేరుకున్నారు. ఆయన ప్రచారంలో భాగంగా దళిత కాలనీలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తితో పాటు మరికొంత మంది జానా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తమకు ఇన్ని సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినా కూడా కనీసం రోడ్లు, తాగునీటి సౌకర్యం, లైట్లు కూడా లేవని నిలదీశారు. పదే పదే జానా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గెలిచిన తర్వాత పోయి సల్లగా హైదరాబాద్ లో ఉంటే తమ సమస్యలు తీర్చేదవరని వారు ప్రశ్నించారు.

దీంతో సహనం కోల్పోయి రెచ్చిపోయిన జానారెడ్డి … అరే పోవోయ్ … పో.. నువ్వు మొనగాడివి ఓటు వేస్తే ఎంత వేయకుంటే ఎంత… అరే ఎయ్యకు పో… మీరు అవసరం లేదయ్యా.. నేను చూసిన అభివృద్ది చూసి ఓట్ల వేసేటోళ్లు వేయండి లేకుంటే లేదు. మీకు ఇష్టం ఉన్న నాయకునికే వేయండి. అతని వద్దకు వెళ్లే పనులు చేయించుకోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరిగి జానా ప్రసంగిస్తుండగా పక్కనే కృష్ణానది ఉన్నా తమకు కనీసం తాగేందుకు నీళ్లు లేవని మళ్లీ ప్రశ్నించారు. మరోసారి అసహనం చెందిన జానారెడ్డి ఇక్కడ ఇష్టం ఉన్నవాళ్లు ఉండి ప్రసంగం వినవచ్చు లేకపోతే లేదు వారు వెళ్లి పోండన్నారు. డ్రైవర్ కు వాహనాన్ని పోనియ్యాలని చెప్పి అక్కడి నుంచి ముందుకు కదిలారు.  జానారెడ్డి కార్యకర్త మీద ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో కింద ఉంది చూడండి.