చంద్రబాబులో టెన్షన్..రేవంత్ రెడ్డే కారణమా ?

తెలుగుదేశంపార్టీలో ఏమవుతోంది ? చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోవటానికి కారణమేంటి ? మంత్రివర్గ సమావేశానికి ముందే అత్యవసర సమావేశం ఎందుకు పెట్టారు ? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తెలుగుదేశంపార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మంత్రులు, ముఖ్య నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈరోజు ఉదయం నుండి మంత్రి నారాయణ విద్యాసంస్ధలపై ఐటి దాడులు చేయటం అందరికీ తెలిసిందే.

దాంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ కంపెనీలు, రాజధాని అమరావతి ప్రాంతంలో భూములపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన పలు సంస్ధల కార్యాలయాలపై ఐటి దాడులు జరిగాయి. మూడు రోజుల క్రితం చంద్రబాబుకు బాగా సన్నిహితుడైన బీద మస్తాన్ రావు ఇల్లు, కార్యాలయాలపైన కూడా ఐటి దాడులు జరిగాయి. ఈరోజు కూడా మళ్ళీ సోదాలు జరుగుతున్నాయి.

తెలంగాణాలో రేవంత్ రెడ్డి ఐటి విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రేవంత్ విచారణలో ఓటుకునోటు కేసులు స్టీఫెన్ సన్ కు ఇవ్వచూపిన రూ 50 లక్షలు, బేరం కుదుర్చుకున్న రూ 5 కోట్ల గురించే ప్రధానంగా విచారణ సాగుతోంది. ఆ విచారణలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకే నారాయణ వ్యాపారాలపై ఐటి దాడులు మొదలయ్యాయనే ప్రచారం ఊపందుకుంది. దాంతో  చంద్రబాబులో ఆందోళన పెరిగిపోయిందట.

అందుకనే అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. సరే, పనిలో పనిగా తనపై తెలంగాణా సిఎం కెసియార్ వ్యాఖ్యలు తదితరాలపైన కూడా చర్చించారులేండి. మొత్తానికి ఐటి  దాడులన్నది అందరిలోను టెన్షన్ పెంచేస్తోందన్నది వాస్తవం.  

 

 

ఇది కూడా చదవండి

కెసియార్ మూడో కన్ను మీద సోషల్ మీడియా సెటైర్