Today Horoscope : డిసెంబర్ 25th శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

today December 25th 2020 daily horoscope in telugu

మేష రాశి: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు !

ఈరోజు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఈరోజు మీకు మంచి పరిస్థితులు ఉన్నాయి. తల్లి వైపు నుంచి డబ్బు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశముంది. ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఈరోజు అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. గోసేవ చేయడం లేదా గోశాలకు విరాళం ఇవ్వండం చేయండి.

వృషభ రాశి: పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు!

ఈరోజు స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఈరోజు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆనందంగా ఉంటారు. కుటుంబంలో శాంతి. ఈరోజు ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఈరోజు వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. కుటుంబ జీవితం సరళంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. లక్ష్మీగణపతి ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మిథున రాశి: ఈరోజు వ్యాపారాలలో అధిక లాభాలు!

ఈరోజు రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం సాధించే అవకాశముంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో సహచరుల నుంచి మద్దతు ఉంటుంది. ఈరోజు సోమరితనాన్ని వీడి చురుకుగా ఉండండి. ఆలయదర్శనాలు. ఈరోజు పిల్లల నుంచి శుభవార్త పొందే అవకాశముంది. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈరోజు అదృష్టవంతులు అవుతారు. ఈరోజు వ్యాపారాలలో అధిక లాభాలు. సప్తముఖి రుద్రాక్ష ధరించండి.

today December 25th 2020 daily horoscope in telugu
today December 25th 2020 daily horoscope in telugu

కర్కాటక రాశి: ఈరోజు పలుకుబడి పెరుగుతుంది !

ఈరోజు మీకు తెలిసిన వారి ద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఈరోజు కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు వ్యాపారాలు లాభిస్తాయి. ఈరోజు ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఈరోజు పిల్లల ఆనందం పెరుగుతుంది. స్నేహితుల సాయంతో నిరాశ భావన అంతమవుతుంది. ఈరోజు మీఅమ్మగారి తరుఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

సింహ రాశి: ఈరోజు ఎన్నో ఆశ్చర్యాలను చూస్తారు !

ఈరోజు రివార్డులను పొందుతారు. ఈరోజు మీకు సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు ఇంట్లో శుభకరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈరోజు ఎన్నో ఆశ్చర్యాలను చూస్తారు. స్నేహితుల సాయంతో వ్యాపారంలో నూతన వనరులు సృష్టించుకుంటారు. ఈరోజు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అనుకోకుండా చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు ధైర్యాన్ని పెంచుతుంది. మీరు ఈరోజు మీపనులను అనుకున్న సమయములో పూర్తిచేయండి. 108 సార్లు ఓం శాంతియుతమైన మనస్సుతో, ఉదయం-రాత్రి స్మరించుకోండి.

కన్య రాశి: ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది !

ఈరోజు పిల్లల వైపు నుంచి ఉన్నత విద్య సంబంధిత ఫలితాలను పొందుతారు. ఆస్తి లాభం ఉంటుంది. ఈరోజు కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఎంచుకున్న రంగంలో చాలా కష్టపడతారు. ఈరోజు వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో చికాకులు.ఈరోజు ఆదాయం పెరుగుతుంది. కోపాన్ని నివారించండి. శ్రీ సుబ్రమణ్య భుజంగాన్ని పారాయణం చేయండి.

తుల రాశి: ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో గడుపుతారు !

ఈరోజు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు. ఈరోజు అదృష్టం లభిస్తుంది. ఈరోజు చదువు విషయంలో ఆసక్తి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో గడుపుతారు. ధనలబ్ధి. ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రణాళిక లేని ఖర్చులు పెరగవచ్చు. ఈరోజు ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. ఉద్యోగాలలో కొత్త పోస్టులు. వాహనయోగం. ఇష్టదేవతారాధన చేయండి.

వృశ్చిక రాశి: ఈరోజు మిత్రులతో విభేదాలు !

ఈరోజు మీ తోబుట్టువులనుండి సహాయసహకారాలు పొందుతారు. ఈరోజు బంధు, మిత్రులతో విభేదాలు. ఈరోజు పిల్లల వైపు నుంచి ఆహ్లాదకరమైన ఫలితాలు వస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.అనారోగ్యం. ఈరోజు శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఈరోజు రుణాలు చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల సమస్యలు రావచ్చు. కనకధార స్తోత్రం పారాయణం చేయండి.

ధనస్సు రాశి: వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి !

ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. ఈరోజు వివాదాల్లో తలదూర్చకండి. మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అందరిలోనూ గౌరవం. ఈరోజు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. మీరు ఎంచుకున్న రంగంలో కష్టించి పనిచేయాల్సి ఉంటుంది. ఈరోజు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఈరోజు ఉద్యోగాలలో అనుకూలత. ప్రాతఃకాలంలో శ్రీసూక్త పారాయణం లేదా వినడం చేయండి.

మకర రాశి: ఆగిపోయిన పనులు ప్రారంభిస్తారు !

చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరకు వాటిని పూర్తి చేస్తారు. ఈరోజు ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో చికాకులు. గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. ఈరోజు కీర్తి పెరుగుతుంది. ఈరోజు బంధుగవులతో విభేదాలు. ఈరోజు ప్రయాణాలు వాయిదా. చాలాకాలంగా ఆగిపోయిన పనులు ప్రారంభిస్తారు. ఈరోజు ఉద్యోగాలలో శ్రమాధిక్యం. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

కుంభ రాశి: ఈరోజు ఆదాయం పెరుగుతుంది !

ఈరోజు వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.ఈరోజు హడావిడిగా గడుపుతారు. ఈరోజు అదనపు బాధ్యత ఉంటుంది. ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఈరోజు సన్నిహితుల నుంచి ఒత్తిడులు. కొత్త పనులు ముందుకు సాగవు. దైవదర్శనాలు. ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా గడుపుతారు. ఈరోజు ఆదాయం పెరుగుతుంది. శ్రీ అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేయండి, లేదా వినండి.

మీన రాశి: ఈరోజు పెట్టుబడిలో లాభం !

ఈరోజు నూతన ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. ఈరోజు మీకు పెట్టుబడిలో లాభం ఉంటుంది. రుణయత్నాలు. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు సోదరులతో కలహాలు. ఉద్యోగాలలో వివాదాలు.ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఆధ్యాత్మిక విశ్వాసం పెరుగుతుంది. ఈరోజు ఆస్తి నిర్వహణలో ఖర్చులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు స్వల్ప అనారోగ్యం. ఈరోజు వ్యాపారాలలో నిరాశ. భవిష్యత్తులో ప్రయోజనాలు అందుకుంటారు.ఓం సూర్య నారాయణే నమో నమః కనీసం 21 సార్లు పఠించండి.