Today Horoscope : డిసెంబర్ 19th శనివారం మీ రాశి ఫ‌లాలు

today December 19th 2020 daily horoscope in telugu

మేష రాశి :ఉద్యోగయత్నాలు మందగిస్తాయి !

ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు ప్రాపంచిక విషయాలపై దృష్టి ఉండదు. ఈరోజు కుటుంబంలో ఒత్తిది పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. ఈరోజు ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఈరోజు భిన్నంగా గడుస్తుంది. ఈరోజు శ్రమాధిక్యం. ఈరోజు పనుల్లో తొందరపాటు. ఓ వ్యక్తి కారణం గా మీ మనసు కరుణ, ప్రేమ దయాదాక్షిణ్యాలు గురించి ఆలోచిస్తుంది. ఆ వ్యక్తి బయటివాడైన, మీ కుటుంబానికి చెందిన వాడైనా అవ్వొచ్చు. ఇష్టదేవతరాధన చేయండి.

వృషభ రాశి : ఉద్యోగాలలో నిరుత్సాహం !

ఈరోజు కొత్త రుణాలు చేస్తారు. ఈరోజు మిమ్మల్ని మీరు మోసం చేసుకునే అవకాశముంది. ఈరోజు సన్నిహితుల నుంచి కీలక సమాచారం. మీ వద్ద ఉన్న డబ్బుని సాధ్యమైనంతవరకు ఆదా చేసుకోండి. ఈరోజు ఆదాయానికి తగ్గట్లు ఖర్చు చేయకపోతే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు పనుల్లో అవాంతరాలు. ఈరోజు ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఈరోజు ఉద్యోగాలలో నిరుత్సాహం. వ్యాపార / పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు మీ జేబులో ఆకుపచ్చ రుమాలు ఉంచండి.

మిధున రాశి :ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి !

ఈరోజు చేపట్టిన పనులు, వ్యవహారాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న పనులను పూర్తి చేసి చూపిస్తారు.ఈరోజు ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. ఈరోజు బంధువులతో వివాదాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఈరోజు కార్యాలయంలో ఏదైనా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరిస్థితిలో పెరుగుదలకు సూర్యోదయ సమయంలో 11 గోధుమ ధాన్యాలను తినండి.

కర్కాటక రాశి : కోరికలు తీరుతాయి !

ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఈరోజు కొంతమందికి మీరు ఈరోజు ఆశ్రయం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అతిధులను ఎక్కువ సేపు ఉంచాలని యోచిస్తారు. అందరిని గౌరవిస్తారు. ఈరోజు కోరికలు తీరుతాయి. శ్రమ అంతగా ఫలించదు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు బంధువులతో వివాదాలు. అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఈరోజు ప్రత్యేకంగా గడుస్తుంది. ఈరోజు గురుచరిత్రను పారాయణం చేయండి.

సింహ రాశి : ఆత్మగౌరవం లభిస్తుంది !

ఈరోజు కుటుంబ సభ్యులు మీకు మద్దతుగా, అండగా నిలబడతారు. ఈరోజు దూరపు బంధువుల కలయిక. ఈరోజు మీ రంగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విందువినోదాలు. ఈరోజు పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ఈరోజు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.ఈరోజు కొంత కష్టంగా గడుస్తుంది. కొన్ని హెచ్చు తగ్గుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు వయసులో చిన్న వారు అయి కెరీర్ కోసం ప్రయత్నిస్తుంటే మీకు ఆత్మగౌరవం లభిస్తుంది. కుటుంబంలో శాంతికి శ్రీసూక్తపారాయణం చేయండి.

కన్య రాశి : ఈరోజు సానుకూలంగా గడుస్తుంది !

ఈరోజు బంధువులను కలుసుకుంటారు. మీ పనితీరును మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు పనిలో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటారు. ఈరోజు స్నేహితుల సలహా తో మీ పనులను పూర్తి చేసుకుంటారు. మీకు తగిన సమయం దొరుకుతుంది. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. ఈరోజు కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. భైరవుడుని ఆరాధించండి.

today December 19th 2020 daily horoscope in telugu

తుల రాశి : శుభకార్యాలలో పాల్గొంటారు !

ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు సవాళ్ళను ఎదుర్కొంటారు. ఈరోజు బాకీలు వసులు అవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. ఈరోజు పనులలో విజయం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అయితే శాశ్వతంగా విజయం సాధించడం కోసం మీరు కొన్ని అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. పేదలకు ఆహారాపదార్థాలు అందించండి.

వృశ్చిక రాశి : ఉద్యోగాలలో అనుకూలత !

మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి.ఈరోజు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ఈరోజు వ్యాపారం పై దృష్టి పెట్టండి. ఈరోజు ఇంటి పనుల్లో బిజీగా గడుపుతారు. ఖాళీ సమయాన్ని పొందలేరు. ఈరోజు ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శ్రీ లక్ష్మీనారాయణుల ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి : వ్యాపారాలు మందగిస్తాయి !

ఈరోజు మీరు బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించడం వలన ప్రయోజనాలు ఉంటాయి.
ఈరోజు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఈరోజు ఆత్మీయులతో మాటపట్టింపులు. దైవచింతన. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఓ అత్యవసర పని ఉండడం వలన, ఇంటి నుంచి బయటకు వస్తారు. ఈరోజు పనుల్లో ఇబ్బందులు అధిగమిస్తారు. ఈరోజు కొత్తగా రుణాలు చేస్తారు. సొంతపనులు కూడా బాధ్యతాయుతంగా చేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామికి దీపారాధన, స్వామి నామపారాయణం చేయండి.

మకర రాశి : ఆగిపోయిన పనులను పూర్తి !

ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఈరోజు మీ పనులను వేగంగా నిర్వహించుకోగలుగుతారు. ఈరోజు కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఈరోజు ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు ఎక్కడ నుంచి అయినా డబ్బు పొందగలుగుతారు. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. సూర్యాష్టకం చదవండి లేదా వినండి.

కుంభ రాశి : శుభవార్తలు వింటారు !

ఈరోజు కుదిరినంతవరకు వివాదాలకు దూరంగా ఉండండి.ఈరోజు పోటీపరీక్షల్లో విజయం. ఈరోజు శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. ఈరోజు నిశ్శబ్దంగా ఉండడం అనేది ఎక్కువ సామర్ధ్యాన్ని సూచిస్తుంది. ఈరోజు మీరు ఎక్కువ కష్టపడాలి. ఈరోజు ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి.

మీన రాశి : వాహనాలు కొంటారు !

ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ఈరోజు ఆనందంగా గడుస్తుంది. ఆనందకరపు రోజులు మీకు మళ్లీ తిరిగి వస్తున్నాయి. ఈరోజు వాహనాలు కొంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. ఆహ్లాదకరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు మీ మనసు చెప్పినట్లు చేస్తారు. బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీకు ఎక్కడినుంచైనా డబ్బు వస్తుంది. ఈరోజు స్థిరాస్తి వృద్ధి. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.