Today Horoscope : డిసెంబర్ 11th శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

today december 10th 2020 daily horoscope in telugu

మేషరాశి: ఆర్ధిక సమస్యలను ఎదురుకుంటారు !

ఈరోజు మిశ్రమఫలితాలు. మీరు ఆర్ధిక సమస్యలను ఎదురుకుంటారు. ఈరోజు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురి అయ్యే అవకాశాలు. మీరు ఈసమయంలో డబ్బు కంటే మీకుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనా త్మకత గల ప్రాజెక్ట్ ల గురించి పనిచెయ్యడానికి కూడా ఇది మంచి సమయం. ఈరోజు మీకు దగ్గరివారు మీకు దగ్గరవుదామని చూస్తారు. సంతానంతో మీరు ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో మంచిగా సాఫీగా సాగుతుంది. ఈరోజు సూర్యారాధన చేయండి.

వృషభరాశి : దేవాలయ దర్శనానికి అవకాశం !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. కమిషన్లు, రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. ఈరోజు మీ లక్ష్యాల కోసం శ్రమించాల్సిన రోజు. మీరు అనుకున్నంతగా ఫలితాలు రాలేదని నిరాశకు గురికాకండి. దేవాలయ దర్శనానికి అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితాన్ని బ్బంది పెట్టేందుకు మ ఈ ఇరుగూపొరుగూ ప్రయత్నించవచ్చు. కానీ మిముల్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు. హనుమంతునికి సింధూరం అందించండి. అద్భుతమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.

మిథున రాశి: ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి !

ఈరోజు ఆనందంగా ఉంటారు. ఈరోజు డబ్బును స్థిరాస్తికి కోసం ఖర్చుచేస్తారు. ఈరోజు ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. వాదనలు, ఇతరులతో వ్యక్తిగత రహస్యాలను చెప్పకండి. వ్యాపారులకి మంచి రోజు. ప్రయాణం ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగ పడుతుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో ఆత్మికమైన విషయాలను చెప్తుంది. దేవాలయంలో కొబ్బరికాయను కొట్టండి.

కర్కాటక రాశి : మీ శక్తి ఎక్కువగా ఉంటుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చివర్లో మీరు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీ బంధువుల లను కలుస్తారు. దీనివల్ల అనుకోని ప్రయోజనాలను పొందుతారు. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ భాగస్వామి ఈ రోజు సంతోషంగా ఉన్నారు. కుటుంబం లో ఆనందం పెంచడానికి శ్రీదుర్గాసూక్తపారాయణం లేదా వినడం చేయండి.

సింహ రాశి: మీకు నచ్చిన పనిచేయండి !

ఈరోజు మీకు నచ్చిన పనిచేయండి. మీ కుటుంబ సభ్యులపట్ల మీ పౌరుషంగా అంటే కోపతాపాలతో ఉండకండి. దీనివల్ల మీకు నష్టం కలుగుతుంది.ఇష్టమైనవారి కోరికలను నెరవేర్చలేకపోవడంతో వారికి మీమీద కోపం వస్తుంది. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి సంతోషాన్ని, ప్రశాంతతను పొందుతారు. మీ సోదరులపట్ల అభిమానంతో, గౌరవప్రదంగా ఉండండి. దీనివల్ల మంచి ఆర్థిక జీవితాన్ని పొందండి.

కన్యా రాశి : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీకు మానసికప్రశాతంత ఉండదు. ఈరోజు మీతల్లి తరుఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ ఈమధ్యన జరిగిన కొన్ని విషయాల వలన మీ మనసు కలతపడి ఉంటుంది. మీ తెలివిని మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగు దలకి వాడండి. మీరు పనిచేసే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే ఇబ్బంది పెట్టవచ్చు ఓపికగా ఉండండి. అనుకూల శుభఫలితాల కోసం శ్రీసూక్తంతో అమ్మవారికి అభిషేకం లేదా పూజ చేయండి.

today december 10th 2020 daily horoscope in telugu

తులా రాశి : ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి !

ఈరోజు ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి. లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నూతన పథకాలను, వెంచర్లను ప్రారంభించడానికి మంచిరోజు. నిరుద్యోగులకు ఈరోజు కష్టపడితేవారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. మీరు మీ సమయాన్ని కార్యాలయ పనులకు వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన పనితీరును, సహనాన్ని మీరు చూస్తారు. బెల్లం రూపం లో ప్రసాదాన్ని అమ్మవారికి అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది.

వృశ్చిక రాశి :బాగా శ్రమించండి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అభివృద్ధిలో కొంత నిలుపుదల ఉంటుంది. మంచిఫలితాన్ని సాధించడానికి బాగా శ్రమించండి. క్లిష్టపరిస్థితిలో బంధువులు ఆదుకుంటారు. ధనాన్ని ఖర్చుపెట్టే టప్పుడు ఆలోచించి పెట్టుబడి పెట్టండి. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. క్రొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఏవిధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీకు దగ్గరైనవారితో మీ సమయాన్ని గడపాలి అనుకుం టారు. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

ధనుస్సురాశి: క్రొత్త ఆలోచనలను వాడండి !

ఈరోజు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. ఈరోజు మీరు అనుకోని బహుమతులను బంధువుల నుంచి అందుకుంటారు. ఎదురు చూడనన్ని రివార్డులను తెస్తుంది. మీరు సంతానం వల్ల ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.
గొప్ప ఆరోగ్య మెరుగుదలలను పొందడానికి శ్రీసూక్తపారాయణం చేయండి.

మకర రాశి : ప్రయాణాలు కలసివస్తాయి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. సంతానం చదువుకోసం డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సీనియర్లు, తోటి ఉద్యోగులు, బంధువులు మీకు మంచి సహకారం అందిస్తారు. కుటుంబ వ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కలసివస్తాయి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ఆహార పదార్థాలను పదార్థాలను పంపిణీ చేయండి.

కుంభ రాశి :ఈరోజు ఆనందంగా గడపుతారు !

ఈరోజు సానుకూల ఫలితాలను పొందుతారు. సంతానముపట్ల తగిన శ్రద్ద తీసుకోండి. ఈరోజు ఆనందంగా గడపుతారు. ఇష్టమైన వారికోసం సమయాన్ని కేటాయించండి. కుటుంబ సభ్యులతో సామరస్యమైన విధానంలో మాట్లాడండి. ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్త మమైన రోజు కాగలదు. తేనెను శివాభిషేకం చేయండి. ఆరోగ్యాన్ని పొందండి.

మీన రాశి: ఈరోజు అనుకూల ఫలితాలు !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు పట్టుదలతో విజయం సాధిస్తారు. దీనికోసం మీ ఆలోచనలను మార్చుకొండి. కుటుంబ సభ్యులతో కొంతసేపు గడపండి. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలే యండి. ఈరోజు మీకోసం తగినంత సమయం దొరుకుతుంది, దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుండటం ఈ రోజు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ వ్యాపారాన్ని, వృత్తి జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి శ్రీసుబ్రమణ్య భుజంగాన్ని పారాయణం చేయండి.