జైపాల్ రెడ్డికి హారీష్ రావు సవాల్

తెలంగాణలో అవినీతికి తెరలేపిందే కాంగ్రెస్ పార్టీ అని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. జైపాల్ రెడ్డి తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకే సెల్ఫ్ గోస్ కోసం మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేశారో ప్రజలందరికి తెలుసన్నారు. ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని జైపాల్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు

జైపాల్ రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. ప్రాజెక్టుల డాక్యుమెంట్లు అన్ని ఆన్ లైన్ లో ఉన్నాయని ఏ తప్పు ఉన్నా చర్చకు సిద్దమన్నారు. ప్రాజెక్టుల పై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని జైపాల్ రెడ్డి కూడా రావాలని దానికి జైపాల్ రెడ్డి సిద్దమేనా అని హారీష్ రావు సవాల్ విసిరారు.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు జైపాల్ రెడ్డి మాటలు ఉన్నాయన్నారు. జలయజ్ఞాన్ని కాంగ్రెస్ పార్టీ ధనయజ్ఞంగా మార్చిందన్నారు. ఇప్పటి వరకు 15 వేల గ్రామాలకు నీరిచ్చామని పైపులు మాత్రమే వచ్చాయి, నీళ్లు రాలేదనడం హాస్యాస్పదమన్నారు. జైపాల్ రెడ్డి చర్చకు రా నాగర్ కర్నూలా, కల్వకుర్తినా, జడ్చర్ల, నాగర్ కర్నూల్ ఎక్కడికి అంటే అక్కడికి వస్తా జైపాల్ రెడ్డి రావాలన్నారు.

పాలమూరు లో 8 లక్షల ఎకరాలకు నీరిచ్చామని ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పదేళ్లలో 5 లక్షల ఎకరాలకు నీరిస్తే తాము నాలుగున్నరేళ్లలో 25 లక్షల ఎకరాలకు నీరిచ్చామన్నారు. కొత్తగా 12 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చామని, 13 లక్షల ఎకరాల్లో తాగునీరు స్థిరికరించామన్నారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పై 1400 కోట్టు వృథా చేశారు. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నా జైపాల్ రెడ్డికి కనపడలేదా అన్నారు. కాగ్ జల్లెడపట్టి తిట్టింది అయినా కూడా కేంద్రమంత్రి గారు ఆ రోజేందుకు మాట్లాడలేదని విమర్శించారు. అసలు దొంగలు కాంగ్రెసోళ్లన్నారు. రైతుల పక్షపాతి, రైతులకు నీళ్లిచ్చిన ఘనత టిఆర్ ఎస్ పార్టీకి, కేసీఆర్ కు దక్కుతుందన్నారు.