హరిష్ రావు తీరు పై గౌడ్స్ ఆగ్రహం (వీడియో)

మంత్రి హరీష్ రావు… సామాన్యులకు దగ్గరగా ఉంటాడు. ఏ పని అయినా సరే వెంటనే పరిష్కారం చూపిస్తాడని పేరు. కేసీఆర్ తర్వాత అంతటి మంచి పేరు పార్టీలో హరీష్ రావుకు ఉంది. కానీ శుక్రవారం నాడు టిఆర్ ఎస్ భవన్ లో హరీష్ రావులో కొత్తకోణం బయట పడిందని గౌడ సోదరులు ఆరోపించారు. ఇంతకీ అసలు కథ ఏంటంటే

తెలంగాణ భవన్ లో కేకే అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశం అయ్యింది. ఏ సామాజిక వర్గం వారైనా సరే తమ తమ డిమాండ్లను మోమోరాండం రూపంలో ఇస్తే వాటిని స్వీకరించి  మేనిఫెస్టోలో చేరుస్తామని టిఆర్ ఎస్ నేతలు తెలిపారు. దీంతో గౌడ సామాజిక వర్గానికి చెందిన కొంత మంది ప్రతినిధులు టిఆర్ ఎస్ భవన్ కు చేరుకున్నారు. గౌడలకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అలాగే గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేయాలని నేతలు ప్రయత్నించారు.   

మేనిఫెస్టో కమిటిని కలిసేందుకు ప్రయత్నించగా కుదరదని టిఆర్ ఎస్ భవన్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అప్పుడే టిఆర్ ఎస్ భవన్ నుంచి బయటికి వచ్చిన మంత్రి హరిష్ రావును వారు కలిసే ప్రయత్నం చేశారు. మెమోరాండం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనకు సమయం లేదని తీసుకోలేనని చెప్పి కారెక్కి హరిష్ రావు వారిని పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. గౌడన్నలు ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో కింద ఉంది చూడండి.

దీంతో గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో గౌడ్స్ పని చేయలేదా… అహర్నిషలు శ్రమించి గీతన్నలు టిఆర్ ఎస్ కు అండగా నిలిస్తే ఇదేనా చేసేది అంటూ గీతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలలో గౌడ్స్ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.