Home Telangana తెలంగాణలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ ఝలక్

తెలంగాణలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ ఝలక్

- Advertisement -

నందమూరి వంశంలో ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసత్వంలో అంతటి పాపులారిటీని సంపాదించారు జూనియర్ ఎన్టీఆర్. బాలకృష్ణ కూడా సుదీర్ఘ కాలం సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కు అతి కొద్దికాలంలో తాతకు తగ్గ మనవడు అని స్టార్ డమ్ వచ్చింది. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయంగా వాడుకోవాలనుకున్న టిడిపి నాయకత్వానికి షాక్ తగిలింది. ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తన మార్కు చూపించారు. మరి ఆ ముచ్చటేందో కింద చదవండి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలను రాజకీయంగా ఎపిలో వినియోగించుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు స్కెచ్ వేసుకున్నారు. ఆ దిశగానే తెలంగాణలో కూటమి ఏర్పాటు చేయించారు. జన్మతహా  ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో తెలంగాణలో జట్టు కట్టారు. కావాలని అతి తక్కువ సీట్లు తీసుకుని కాంగ్రెస్ ను బంపర్ మెజార్టీతో గెలిపించాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రయోగంలో వచ్చిన ఫలితాల ఆధారంగా ఎపిలో యాక్ట్ చేయాలనుకున్నారు. తెలంగాణ ఎన్నికల అనుభవాలను చూసి ఎపిలో తన వ్యూహం రూపొందించుకోవచ్చనుకున్నారు. కానీ ఒక విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మక అడుగులు వేసి చంద్రబాబు ఆలోచనలకు బ్రేక్ వేశారు. 

తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి నందమూరి సుహాసిని ని బరిలోకి దించారు చంద్రబాబు. కూటమిలో భాగంగా కూకట్ పల్లి సీటును టిడిపి తీసుకుంది. ఈ సీటును నందమూరి వంశానికి ఇవ్వడంలో చంద్రబాబు మాంచి స్కెచ్ వేశారుని టిడిపి వర్గాల్లో టాక్ ఉంది. నందమూరి సుహాసిని ని బరిలోకి దించడం ద్వారా నందమూరి వంశం అంతా టిడిపికి పనిచేసేలా చేయడం దీని ఉద్దేశంగా కనబడుతున్నది. అలా ఆమెను బరిలోకి దింపి ఎన్టీఆర్ వారసత్వంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ను పార్టీకి ప్రచారం చేయించాలన్న ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో జూనియర్ తో ప్రచారం చేయించిన తర్వాత పనిలో పనిగా ఆంధ్రా ఎన్నికల్లోనూ రేపు ప్రచారం చేయించాలన్న ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. 

కానీ జూనియర్ ఎన్టీఆర్ సుహాసిని పోటీ విషయంలో ఆలోచించి వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు కనబడుతున్నది. సుహాసినికి టికెట్ అనౌన్స్ చేయగానే అక్కకు అభినందనలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఈమేరకు ట్విట్టర్ లో స్పందించారు. సోదరి పోటీ చేయబోతున్నందుకు అభినందనలు. ఆమె విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఇక ట్వీట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోతాడా అని అటు టిడిపి అధినాయకత్వం, ఇటు నందమూరి ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. కానీ జూనియర్ మాత్రం ప్రచారానికి వెళ్లకూడదు అని నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చాయి.

జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని కి ప్రకటనతోనే మద్దతు ఇచ్చి సరిపుచ్చుకునే అవకాశాలే కనబడుతున్నాయి. అంతకు మించి తెలంగాణ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోరాదన్న ఆలోచనలో యంగ్ టైగర్ ఉన్నట్లు సమాచారం. ఇదే కాకుండా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఏ నాయకుడైనా, ఫిల్మ్ స్టార్ అయినా వారి పేర్లను ఈసి కి ఆయా పార్టీలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు టిడిపి పెద్దలకు ప్రచారం పై సమ్మతి రాలేదని చెబుతున్నారు. అందుకే జూనియర్ పేరును కూడా ఈసి కి టిడిపి సమర్పించలేదని తెలుస్తోంది.

2019లో జూనియర్ ఏం చేయబోతున్నారు ?

రానున్న రోజుల్లో అయినా జూనియర్ ఎన్టీఆర్ టిడిపికి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేస్తారా? లేదంటే సినిమాలకే పరిమితం అవుతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం అన్న భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. 2009 లో జూనియర్ ఎన్టీఆర్ మహా కూటమి కి జోరుగా ప్రచారం చేశారు. కానీ అప్పుడు టిడిపి, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీల కూటమిని చిత్తు చేసి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో గెలిపించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో జూనియర్ ప్రచారానికి దూరంగానే ఉన్నారు. మరి 2019 లో ఆయన ఏం చేస్తారా అని రెండు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. 

 

Advertisement

- Advertisement -

Related Posts

దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచినా నో ప్రాబ్లమ్.. కేసీఆర్ దగ్గర ప్లాన్ ‘బి’ ఉందా ?

దుబ్బాకలో నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో  ప్రధానమైన పోటీ తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్యనే నెలకొని ఉంది.  తెరాస తరపున సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో ఉండగా కాంగ్రెస్ నుండి చెరుకు...

పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు ఎక్కడ ?

జానారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు.చాలా ఫేమస్ అండ్ పొలైట్ పొలిటీషియన్. ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రితో పాటు ఎన్నో మంత్రి పదవులు ఆయన్ని వరించాయి. ఒకప్పుడు సీఎం రేసులో కూడా నిలిచారు....

బాబు మోహన్ ప్రశ్నకు సమాధానం లేదేంటి హరీష్ రావు

 తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రచారానికి మరో వారం రోజులే సమయం ఉండటంతో అక్కడ పోటీచేస్తున్న ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెరాస తరుపున హరీష్ రావు ప్రచారం చేస్తుంటే,...

Recent Posts

ఇది బీహార్ కాదు ఆంధ్ర ప్రదేశ్ అంటూ నిమ్మగడ్డ రమేష్ పై కొడాలి నాని అసహనం!

ఆంధ్ర ప్రదేశ్ : ఏపీలో కరోనా సమయంలో స్ధానిక సంస్ధలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు ఒక్కొక్కరుగా ఎదురుదాడి మొదలుపెడుతున్నారు. కరోనా...

రాజ‌మౌళి సెట్ చేసిన రికార్డ్‌ని బ్రేక్ చేసిన రాధేశ్యామ్

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి చిత్రంతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జ‌క్క‌న్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో త‌న రికార్డుల‌ను తానే తిర‌గరాయాల‌ని భావిస్తున్నాడు....

థియేట‌ర్స్ తెర‌వాలంటూ సీఎంతో పాటు చిరుకు లేఖ రాసిన న‌ట్టి

క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన భీబ‌త్సం అంతా ఇంతాకాదు. ఈ వైర‌స్ వ‌ల‌న ప్ర‌పంచ మొత్తం వ‌ణికిపోయింది. ముఖ్యంగా కరోనా ప్రభావం సినీ రంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అయితే మన టాలీవుడ్ లో...

78 ఏళ్ళ వ‌య‌స్సులో హీరోగా.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ఫ్యాన్స్

ఏ వ‌య‌స్సులో చేయాల్సింది ఆ వ‌య‌స్సులో చేస్తేనే అందంగా ఉంటుంది. యుక్త వ‌య‌స్సులో చేయాల్సింది ముస‌లోళ్ళు అయ్యాక చేసిన‌, ముస‌లోళ్ళు అయ్యాక చేయాల్సింది యుక్త వ‌య‌స్సులో చేసినా చాలా చెండాలంగా ఉంటుంది. ఇప్పుడు...

త‌న బెస్ట్ ఫ్రెండ్ హిజ్రా అన్న ఉపాస‌న‌..వారికి దేవి మాత‌ను కొలి‌చే అర్హత లేద‌ని వ్యాఖ్య‌లు

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న చాలా ప‌ద్ద‌తి గ‌ల అమ్మాయి అని చాలా మంది చెప్పేమాట‌. ఇంటి బాగోగుల‌తో పాటు బిజినెస్ ప‌నుల‌ని చ‌క్క‌దిద్దుకుంటూ అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటూ ఉంటుంది....

వైసీపీలోకి వెళ్లి తప్పు చేశా.. టీడీపీలోనే ఉండాల్సిందని ఫీలవుతున్న ఫ్యాక్షన్ లీడర్

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు టక్కున కాళ్ళ ముందు మెదులుతాయి.  ఆ తరహా రాజకీయాలు ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు లేవు.  కానీ వాటిల్లోంచి నాయకులుగా పుట్టినవారు అక్కడ...

భీమ్ వల్ల కానిది వకీల్ సాబ్ వల్ల అవుతుందా.. కాస్త కష్టమే అంటున్నారు..?

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో దాదాపు 7 నెలలుగా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే థియోటర్స్ కూడా మూతపడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి....

పోరాడితేనే పోలవరం బ్రతుకుతుంది 

ఆంధ్రుల చిరకాల స్వప్నాల్లో  పోలవరం ప్రాజెక్ట్ కూడ ఒకటి.  రాష్ట్రంలో ఉన్న కరువును దాదాపు తరిమికొట్టగల సత్తా ఉన్నా ప్రాజెక్ట్.  జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్.  విభజన హామీల్లో  పోలవరం  బాధ్యత పూర్తిగా...

కమల్ హాసన్ ఇండియన్ 2 ఆగిపోయింది ?.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ..!

శంకర్ కెరీర్ లో మూడవ సినిమాగా వచ్చింది ఇండియన్. ఈ సినిమా తెలుగులో భారతీయుడుగా రిలీజైంది. ఇండస్ట్రీకొచ్చిన మూడేళ్ళలోనే కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో తో సినిమా చేసే అవకాశం దక్కించుకొని...

కేసీఆర్ మూలంగా ఆంధ్రాకు కోట్ల రూపాయల నష్టం 

పండుగల సీజన్ అంటే రాష్ట్ర రవాణా సంస్థకు భారీ ఆదాయాలు తెచ్చుకునే  సౌలభ్యం ఉంటుంది.  ఎప్పుడూ అప్పుల్లో కొట్టుకునే ఆర్టీసీకి పండుగ సెలవులు కొంత ఊరటని ఇస్తుంటాయి.  సంక్రాతి తర్వాత తెలుగు ప్రజలు ఎక్కువగా ఎదురుచూసే  పండుగ...

Movie News

రాజ‌మౌళి సెట్ చేసిన రికార్డ్‌ని బ్రేక్ చేసిన రాధేశ్యామ్

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి చిత్రంతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జ‌క్క‌న్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో త‌న రికార్డుల‌ను తానే తిర‌గరాయాల‌ని భావిస్తున్నాడు....

థియేట‌ర్స్ తెర‌వాలంటూ సీఎంతో పాటు చిరుకు లేఖ రాసిన న‌ట్టి

క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన భీబ‌త్సం అంతా ఇంతాకాదు. ఈ వైర‌స్ వ‌ల‌న ప్ర‌పంచ మొత్తం వ‌ణికిపోయింది. ముఖ్యంగా కరోనా ప్రభావం సినీ రంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అయితే మన టాలీవుడ్ లో...

78 ఏళ్ళ వ‌య‌స్సులో హీరోగా.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ఫ్యాన్స్

ఏ వ‌య‌స్సులో చేయాల్సింది ఆ వ‌య‌స్సులో చేస్తేనే అందంగా ఉంటుంది. యుక్త వ‌య‌స్సులో చేయాల్సింది ముస‌లోళ్ళు అయ్యాక చేసిన‌, ముస‌లోళ్ళు అయ్యాక చేయాల్సింది యుక్త వ‌య‌స్సులో చేసినా చాలా చెండాలంగా ఉంటుంది. ఇప్పుడు...

Bigg boss 4: ఈ వారం హోస్ట్ సమంతనే… ఇది ఫిక్స్.....

తెలుగు రాజ్యం ముందే చెప్పింది. ఈ వారం హోస్ట్ గా నాగార్జున రావట్లేదు. సమంత వస్తోందని. చెప్పినట్టుగానే జరిగింది. ఈ వారం హోస్ట్ గా నాగార్జున రావడం లేదు. నాగ్ కోడలు, ప్రముఖ...

శివుడి అవ‌తారంలో స్టార్ హీరో.. కొట్టి పారేసిన టీం

సినిమాల‌కు సంబంధించి ఇటు సోష‌ల్ మీడియాలో కాని అటు ఫిలిం న‌గ‌ర్‌లో కాని చ‌క్క‌ర్లు కొట్టే వార్త‌లు అన్నీ ఇన్నీ కావు. ఇందులో నిజ‌మెంత ఉందో, అబ‌ద్ద‌మెంత ఉందో తెలుసుకోవ‌డానికి చాలా రోజులు...

మ‌ల్లిక ఇంత మూడీగా ఉందేంటి , బ‌స్తీ బాల‌రాజు ఏమ‌న్నాడు ?

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ఆస‌క్తిక‌ర చిత్రాల‌లో చావు క‌బురు చ‌ల్లగా. ఎన‌ర్జిటిక్ హీరో కార్తికేయ‌, గ్లామ‌ర్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నూత‌న ద‌ర్శకుడు కౌశిక్ పెగ‌ళ్ళ‌పాటి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మెగా...

త‌న బెస్ట్ ఫ్రెండ్ హిజ్రా అన్న ఉపాస‌న‌..వారికి దేవి మాత‌ను కొలి‌చే...

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న చాలా ప‌ద్ద‌తి గ‌ల అమ్మాయి అని చాలా మంది చెప్పేమాట‌. ఇంటి బాగోగుల‌తో పాటు బిజినెస్ ప‌నుల‌ని చ‌క్క‌దిద్దుకుంటూ అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటూ ఉంటుంది....

Bigg boss 4: శనివారం నో హోస్ట్.. ఆదివారం సాయంత్రం 6...

బిగ్ బాస్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఇక ఈ వారం ఎలాగూ నాగార్జున హోస్ట్ గా రాడని తెలిసిసోయింది కదా. ఆయనెక్కడో షూటింగ్ లో ఫుల్లు బిజీగా ఉన్నారు. దీంతో...

భీమ్ వల్ల కానిది వకీల్ సాబ్ వల్ల అవుతుందా.. కాస్త కష్టమే...

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో దాదాపు 7 నెలలుగా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే థియోటర్స్ కూడా మూతపడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి....

Dharsha Gupta Joshful Photos

Tamil Actress,Dharsha Gupta Joshful Photos Check out,Dharsha Gupta Joshful Photos,Dharsha Gupta Joshful Photos ,Dharsha Gupta Joshful Photos Shooting spot photos,Actress Kollywood Dharsha Gupta Joshful...