పోలీసులపై దామోదర రాజనర్సింహ్మ ఉగ్రరూపం (వీడియో)

 

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ పోలీసులకు ఉగ్రరూపం చూపించారు. జగ్గారెడ్డి అరెస్టు నేపథ్యంలో సంగారెడ్డి బంద్ లో పాల్గొనేందుకు దామోదర రాజనర్సింహ్మ సంగారెడ్డి వెళ్తున్నారు. ఈ సమయంలో పోలీసులు ఆయనను అడ్డగించి అరెస్టు చేశారు.

అయితే దామోదర మనుషులతో పోలీసులు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఒక ఎస్సై దామోదర కారులో చేయి పెట్టి దామోదర మనిషి సెల్ ఫోన్ గుంజుకున్నాడు. అంతేకాకుండా ఆ సమయంలో దామోదర మనిషిని బే అని తిట్టడం ఆయన చెవిన పడింది. దీంతో ఆగ్రహావేశంతో కారు దిగిన రాజనర్సింహ్మ సదరు ఎస్సై ని కడిగి పారేశారు. పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగిన వీడియో పైన ఉంది చూడండి.