Currency Notes: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్లు

Currency Notes: నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద హైదరాబాద్ – నాగపూర్ జాతీయ రహదారి మీద నోట్ల తుక్కు కుప్పలు కుప్పలుగా కనిపించడం కలకలం రేపింది. లారీ నుండి కిందపడిన సంచి పై నుంచి వాహనాలు వెళ్లడంతో తుక్కు రోడ్డు మీద చెల్లా చెదురుగా పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇంతకీ అవి అసలైనవా? లేక నకిలీ నోట్లా? అసలైనవైతే తుక్కుగా ఎందుకు మార్చారు? అసలు వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అంశంపైనా తీవ్ర అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాత నోట్లను మెట్టుపెట్టే క్రమంలో రహస్య ప్రదేశంలో కాల్చేస్తుంది తప్ప ఇలా తరలించదు. దీన్ని బట్టి చూస్తుంటే అది బ్లాక్ మనీ లేదా నకిలీ నోట్లు అయ్యే అవకాశం ఉంది. ఏ వాహనం నుంచి అవి జారిపడ్డాయో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజిలు పరిశీలిస్తున్నాం అని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles