మంత్రి పువ్వాడ అజయ్ కి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి బారినపడుతున్న మంత్రుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుటికే పలువురు మంత్రులు కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు. తాజాగా, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కూడా కరోనా సంక్రమించింది. నిన్న ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

Telangana Minister Puvvada Ajay Kumar Tested Corona Positive

దీంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మంత్రి.. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. కరోనా నుంచి కోలుకుని మళ్లీ యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు.

ఇక, తెలంగాణలో సోమవారం 491 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,78,599కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 48,005 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు తెలిపింది. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 62,05,688 కరోనా నిర్దాణ పరీక్షలు చేసినట్టు పేర్కొంది.

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles