సేనాధిపతిని కలిసిన కేసీఆర్! రాజు గారిని కూడా దర్శింకోనున్నారా?

CM KCR met home minister amith shah today in neew delhi

 

CM KCR met home minister amith shah today in neew delhi
CM KCR met home minister amith shah today in neew delhi

న్యూ-ఢిల్లీ: మూడు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. మొదటి రోజే ఆయన కేంద్ర హోంమంత్రి, జలశక్తి మంత్రులను కలవడం విశేషం. ప్రధాని మోదీని కలుస్తారా? లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల తెలంగాణలో భారీ వరదలు వచ్చి, పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికంగా సాయం చేయాలని హోంమంత్రి అమిత్ షాను సీఎం కేసీఆర్ కోరారు. విపత్తుల నిర్వహణ విభాగం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. అందుకే అమిత్ షాను కలిసి రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. అమిత్ షాతో భేటీకి ముందు కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశం అయ్యారు. షెకావత్‌ నివాసంలో సుమారు గంటపాటు ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించినట్లు సమాచారం. తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు తెలిపినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతులున్నాయి.

CM  KCR met Union Minister Gajendra Singh Shekhawat Ji in New Delhi today
CM KCR met Union Minister Gajendra Singh Shekhawat Ji in New Delhi today

రెండు రోజుల క్రితం డిసెంబర్ 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. “దేశ రాజధానిలో ఉన్న ప్రభుత్వ భ‌వనాలు అవసరాలకు తగినట్టుగా లేవు. పైగా అవి గత వలస పాలనకు చెందినవి. ఈ క్రమంలోనే ఇలాంటి నిర్మాణం ఎప్పుడో చేపట్టాల్సింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు భారతదేశ ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు గర్వకారణం. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలి” అని సీఎం కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. ఆ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నేతలంతా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మళ్లీ వారితోనే కేసీఆర్ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.