కేసీఆర్ ఇలాకాలో ఇదేం పరిస్థితి (వీడియో)

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోని గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలను సందర్శించడానికి వెళ్లిన విద్యార్ధి సంఘాలకు విద్యార్ధులు కన్నీరు పెట్టుకుంటూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమకు అన్నం సరిగా పెట్టడంలేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆ బాలికలు కన్నీరు మున్నీరయ్యారు. వాన  వస్తే వర్షం నీటితో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మరుగుదొడ్లు సరిగా లేక అవస్థలు పడుతున్నామని విద్యార్ధులు విద్యార్ధి సంఘాల నాయకులకు తెలిపారు. నీరు సరిగా రాక అవస్థలు పడుతున్నామన్నారు.

సీఎం కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో విద్యార్ధుల అవస్థలు కనబడుట లేదా అని విద్యార్ధి సంఘ నేతలు ప్రశ్నించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటూ గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి తన స్వంత నియోజకవర్గంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఎటువంటి సమాధానం చెబుతారని వారు ప్రశ్నించారు. నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల పెడుతున్నామని గొప్పలు చెప్పి అందులో కనీస వసతులు కల్పించరా అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉందని వెంటనే పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

కన్నీరు పెడుతున్న విద్యార్ధినిలు