బిగ్ బ్రేకింగ్ న్యూస్… తెలంగాణ నూతన మంత్రులకు శాఖల కేటాయింపు

రాజ్ భవన్ లో తెలంగాణ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రులు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ జూబ్లీహాల్ కు చేరుకున్నారు. వారు ఫైనాన్షియల్ సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ అధికారికంగా మంత్రులకు శాఖలు కేటాయించారు. దీంతో గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణకు బ్రేకు పడినట్టయ్యింది.

పలువురు కీలక నేతలకు మంత్రి పదవి దక్కకపోవడంతో పలువురు నిరుత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా కేటిఆర్, హరీష్ రావులకు మంత్రి పదవులు దక్కకపోవడంతో పార్టీలో చర్చనీయాంశమైంది. నూతన మంత్రులు రేపటి నుంచి బాధ్యతలు చేపట్టి పెండింగ్ ఫైళ్లను పరిష్కరించనున్నారు. పలువురు నేతలు, అధికారులు నూతన మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

నూతన మంత్రులకు కేటాయించిన శాఖలివే…

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి- వ్యవసాయశాఖ

ఎర్రబెల్లి దయాకర్ రావు- పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధి

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి- అటవీ, దేవాదాయశాఖ, న్యాయ శాఖ

ఈటల రాజేందర్- వైద్య, ఆరోగ్య శాఖ

కొప్పుల ఈశ్వర్- సంక్షేమశాఖ

వేముల ప్రశాంత్ రెడ్డి- రోడ్లు భవనాలు-రవాణాశాఖ

గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి- విద్యా శాఖ

సిహెచ్. మల్లారెడ్డి- కార్మిక శాఖ, ఉపాధి, మానవ వనరుల శాఖ

శ్రీనివాస్ గౌడ్- ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం

తలసాని శ్రీనివాస్ యాదవ్- పశు సంవర్ధక శాఖ

మహ్మూద్ అలీ ఇప్పటికే హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో కేసీఆర్ కేబినేట్ లో ఇప్పటివరకు 11 మంది మంత్రులుగా చేరారు. పార్లమెంటు ఎన్నికల తర్వాతనే మరో దశ విస్తరణ జరిగే అవకాశం ఉంది. అందులో ఐదుగురికి అవకాశం దక్కనుంది.