చంద్రన్న విజన్ ,అనుభవం అన్ని ఏమైపోయాయి… ఎందుకిలా చేసాడు!

chandrababu did a multiple mistakes in ghmc elections

తెలంగాణా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు ప్రధాన ఎన్నికలను మరిపించాయి. బిజెపి, టిఆర్ఎస్‌ల మధ్య పోటీ తారాస్థాయిలో ఉండటం దానికి తగ్గట్టే ప్రచారం చేశారు. ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో కూడా ఒకరిని మించి ఒకరు ప్రచారం చేసుకోవటంలో సఫలమయ్యారు.ఈ రోజు తేలిన ఫలితాలలో ఏవరి బలం ఏంటో తేలిపోయింది. టిడిపి పార్టీ కూడా గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి నిలిచింది. మొత్తం 150 డివిజన్లకు గాను 100 డివిజన్లలో టిడిపి అభ్యర్థులు పోటీ చేశారు. తెలంగాణాను డెవలప్ చేసింది నేనే , హైటెక్ సిటీ నిర్మించిందే నేనే , యువ పారిశ్రామికవేత్తలు, కొత్త పరిశ్రమలను మేమే ఏర్పాటు చేశాం. లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాం, టిడిపిపై నమ్మకం పెట్టండి… మా అభ్యర్థులను గెలిపించండి… అంటూ ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రచారం చేశారే తప్ప డైరెక్ట్ గా హైదరాబాద్ లో ప్రత్యక్షంగా ప్రచారం చేయక పోవటం వాళ్ళ టీడీపీ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు కూడా సాధించలేకపోయారు.

chandrababu did a multiple mistakes in ghmc elections
chandra babu naidu

ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు ప్రచారానికి రాకపోవడంపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందట. సోషల్ మీడియాలో సందేశాలు పంపి చేతులు దులిపేసుకుని , ప్రచారానికి రాకపోవడంతోనే జనం కనీసం ఓట్లు కూడా వేయలేదని ఆ పార్టీ అభ్యర్థులు భావిస్తూ బహిరంగంగా చంద్రబాబును విమర్శలు చేస్తున్నారట.వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ తరువాత ఎం.ఐ.ఎం, ఆ తరువాత టిడిపికి జనం పట్టం కట్టారు.కానీ ఇప్పుడు టిడిపి తెలంగాణలో వుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనం. అసలిక్కడ పోటీ చేయడం అవసరమా, పోటీ చేసి ఉన్న పరువు కూడా పోగొట్టుకోవటం ఎందుకీ కర్మ అని వాపోతున్నారట.