టిఆర్ఎస్ బోనగిరి నర్సయ్య చేసింది చిన్న పనే కానీ…

భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆద్వర్యంలో బిఎల్ ఆర్ ఫౌండేషన్ అనేక మంది పేద వారికి ఆపన్న హస్తంగా నిలుస్తుంది. రూ. 60 రూపాయలు చెల్లించి ప్రమాద భీమా చెల్లిస్తే సంవత్సరం వరకు ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా 5 లక్షల రూపాయలు చెల్లించబడుతుంది. తీవ్ర గాయాలైన వారికి గాయాల తీవ్రత ఆధారంగా చెల్లించబడుతోంది.

బిఎల్ ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి ఉపయోగం కలుగుతుందని లబ్దిదారులు తెలిపారు. దీనిని ముందుగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో పెట్టి విజయవంతం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. 

ఇబ్రహీంపట్నం బాధిత కుటుంబానికి 15 లక్షల చెక్కు ఇస్తున్న నర్సయ్య గౌడ్

2018 మార్చిలో ప్రారంభమైన పథకంలో ఇప్పటి వరకు 60 మంది లభ్దిదారులు ప్రమాదం లో చనిపోతే వారికి భీమా చెల్లించి వారి కుటుంబ సభ్యులను ఆదుకున్నామని తెలిపారు. షాద్ నగర్ సమీపంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన  ఓ కుటుంబం వారు ముగ్గురు చనిపోగా వారి పిల్లలకు 15 లక్షల రూపాయలు బీమా సొమ్ము చెల్లించి వారి చదువు బాధ్యతను కూడా తీసుకుంటామని ఫౌండేషన్ ప్రకటించింది.

గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది పేదవారు కూలీ నాలీ చేసుకొని బతుకుతారు. వారికి బీమా సౌకర్యాల గురించి పెద్దగా అవగాహన ఉండదు. అనేక మంది రోగాల బారిన పడి కూడా చనిపోతుంటారు. వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ప్రాణాలు విడుస్తారు. మరికొంత మంది రోడ్డు ప్రమాదంలో పడి చనిపోవడంతో ఆ కుటంబంలోని వారు దిక్కులేని వారవుతారు. వీటన్నింటిని ఒక డాక్టర్ గా వారి కష్టాలను చూసిన నేతగా మానవీయ కోణంలో ఆలోచించిన బూర నర్సయ్య గౌడ్ కులాలకు, పార్టీలకు అతీతంగా తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరిని ఆదుకునే ఆలోచనతో ప్రారంభించినదే బిఎల్ ఆర్ ఫౌండేషన్.

ఈ ఫౌండేషన్ లో ఇప్పటి వరకు వేలాది మంది సభ్యులుగా చేరారు. 60 రూపాయల భీమా పథకంలో కూడా వేలాది మంది చేరారు. ప్రజా సంక్షేమం కోసం బూర నర్సయ్య గౌడ్ ప్రారంభించిన ఈ పథకం చాలా మందికి ఉపయోగపడుతుంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఈ పథకం విజయవంతం కావడంతో తెలంగాణ అంతటా ఈ పథకాన్ని విస్తరించారు. బూర నర్సయ్య గౌడ్ యువసేన కూడా ఈ పథకం విస్తరణకు  కృషి చేస్తుంది. బిఎల్ ఆర్ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు బూర నర్సయ్య గౌడ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

బిఎల్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన భీమా పథకం చాలా మంది పేద వారికి ఉపయోగపడుతుంది. ఎటువంటి రాజకీయ కోణం లేకుండా ప్రజలందరికి ఈ బీమా వర్తించేలా చేసిన బూర నర్సయ్యకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. పార్టీలకతీతంగా పెట్టినందుకు మేం అభినందిస్తున్నాం. ఎంతో మంది పేదవారిని ఆదుకోని వారి మనస్సులను గెలుచుకున్నారు. ఇప్పటికి ఈ పథకంలో చేరని వారు తెలుసుకొని చేరాలని కోరుతున్నాం.

ఉయ్యాల ప్రశాంత్ గౌడ్, బూర నర్సయ్య గౌడ్ యువసేన, టిఆర్ఎస్ నాయకులు