హైదరాబాద్ లో అమిత్ షా హల్ చల్… కెసిఆర్ మీద చురకలు

హైద్రాబాద్ హిందుస్థాన్ మే హై ..కిసీకా అడ్డా నై .. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కెసియార్  మీద ఎక్కు పెట్టిన తొలి బాణం ఇది.

ఢిల్లీలో వియ్యం, హైదరాబాద్ లో కయ్యం అనే ద్వంద్వ వైఖరి తో బిజెపి ఉందా.

ఎందుకంటే, అమిత్ షా  ఈరోజు హైదరాబాద్ కు వచ్చి  ముఖ్యమంత్రి కెసిఆర్ మీద బాగానే చురకలు జోకులు వేశారు.

అమిత్ షా చాలా స్పష్టంగా కెసియార్ అయువు పట్టు లాంటి విధానాల మీద గురి పెట్టి బాణాలు వదిలారు.

అమిత్ షా కు బడి పిల్లల స్వాగతం

‘ఈ రోజు బిజెపి కార్యాలయం లో మాట్లాడుతూ జమిలి ఎన్నికలకు కేసీఆర్ కూడా మద్దతిచ్చి ఇప్పుడు ముందస్తు కు వెళుతున్నారు?,ఆశ్యర్యం కల్గిస్తుంది. ముందస్తు తో ఎందుకు ప్రజలపై భారం వేస్తున్నారు,’ అంటూ  కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి అన్నారు.

కేసీఆర్ స్వార్థం కోసమే ముందస్తు  అని ఆరోపణ కూడా చేశారు. ఇంకా ఒకడుగు ముందుకేసి, ఎంఐఎం కనుసన్నల్లో కేసీఆర్ పాలన సాగుతుతుంది, ఎంఐఎం కోసమే తెలంగాణ విమిచన దినాన్ని తెలంగాణ  ప్రభు  త్వం  జరపడం లేదు అని కూడా విమర్శించారు.

ఓటు బ్యాంక్ పోలిటిక్స్ కోసమే కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ లు తెచ్చారని అన్నారు.

కెసిఆర్ మర్చిపోయిన చాలా విషయాలను అమిత్ షా గుర్తు చేస్తూ చాలా ఇబ్బందికరమయిన ప్రశ్నవేశారు.

* దళిత్ ని ముఖ్యమంంత్రిని చేస్తారని చెప్పి కెసిఆర్ మరిచారు. కాని దళితులు మర్చిపోలేదు, ఈసారైనా కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తారా ..? అని ప్రశ్నించారు. 

హైదరాబాద్ అమిత్ స్వచ్ఛ భారత్

సచివాలయం కు వేళ్ళని సీఎం రాష్ట్రాన్ని అభివ్తుద్ది చేస్తారంటే ఎలా నమ్మాలి ..? అని మరొక తీవ్రమయిన వ్యాఖ్య చేశారు.

 

*నియోజకవర్గాలలో ఆసుపత్రి లు ,కెజిటుపిజి ఎయిపోయాయి ..?

*డబుల్ బెడ్ రూమ్స్ ఎక్కడికి వెళ్లాయి ..?

*నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కేసీఆర్ కు పట్టదు ..!

*కొత్త జిల్లాల్స్తో తో సాధించింది శూన్యం ..ప్రజలకు కొత్త సమస్యలు వచ్చాయి

*ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన సర్కార్ కేసీఆర్ ది ..ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు ,?

*సిరిసిల్ల లో దళితుల పై దాడులు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా?

*పీఎం పైసల్ భీమా యోజన ను కావాలానే కేసీఆర్ సర్కార్ ప్రజలకు అందివ్వడం లేదు, ఇది నిజం కాదా?

*కేంద్ర పథకాలు కలెక్టర్ ఆఫీస్ కే పరిమితం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ..దీనికి కేసీఆర్ సమాధానసం చెప్పాలి?

అమిత్ షా క్లారిటీ ఇచ్చిన అంశాలు: 

*టీఆరెస్ తో మాకు ఎలాంటి దోస్తీ ఉండదు *

*ఎవరికి అనుమానాలు వద్దు *

*బీజేపీ ఒంటరిగా నే పోటీచెస్తుంది *