దుబ్బాక విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరెయ్యాలని బీజేపీ కసరత్తులు

bjp party focused on next assembly elections in telangana

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ను గద్దెదించి తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలని కేంద్రంలోని బీజేపీ కృతనిశ్చయంతో ఉందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. దుబ్బాక విజయం బీజేపీలో నింపిన జోష్ అంతా ఇంతాకాదు. అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇన్నాళ్లుగా పట్టించుకోని తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు పట్టించుకొని తాజాగా త్వరలోనే జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిసారించారు. అంతేకాదు.. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్చార్జిలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించి అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. కేసీఆర్ తో తొడగొట్టడానికి రెడీ అయ్యారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి.

bjp party focused on next assembly elections in telangana
bjp party focused on next assembly elections in telangana

నిన్ననే జీహెచ్ఎంసీ ఎన్నికలకు రెడీ అవుతూ సీఎం కేసీఆర్ ప్రకటన విడుదల చేసిన వెంటనే కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఉన్నఫళంగా తెలంగాణపై దృష్టిసారించడం విశేషంగా మారింది. దుబ్బాక వేవ్ ను తెలంగాణలో కొనసాగించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టువిడవకూడదని బీజేపీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలనుంచి జాతీయ కార్యవర్గం నుంచి బాగా పనిచేసే వారిని ఏర్చికూర్చి ఈ నియామకం చేసినట్టు తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తాజాగా జీహెచ్ఎంసీ ఇన్ చార్జిలను బీజేపీ అధిష్టానం నియమించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి భూపేందర్ యాదవ్ ను జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్ చార్జిగా నియమించారు. ఇక ఈయనతోపాటు కర్ణాటక మంత్రి సుధాకర్, మహారాష్ట్ర బీజేపీ విప్ ఆశిష్, గుజరాత్ బీజేపీ కార్యదర్శి ప్రదీప్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డిలను సహ ఇన్ చార్జిలుగా నియమించారు. ఇక వీరితోపాటు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం.