బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

raja singh

హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో వెళ్తున్న క్రమంలో రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత రాత్రి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేశారు. విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్.. తోట ఆగయ్య ఇంటికి ఆయనను పరామర్శించారు. ఈ క్రమంలో రాజాసింగ్ కూడా అక్కడి వెళ్ళే ప్రయత్నం చేయగా ఆయనను పోలీసులు హైదరాబాద్ అరెస్ట్ చేశారు