మోస్ట్ డైనమిక్ సిటీస్: ప్రపంచంలోనే నెంబర్ టు హైదరాబాద్

హైదరాబాద్ ను ఒక అడుగు కిందికి నెట్టేసి బెంగళూరు ఇపుడు ప్రపంచంలోనే  షార్ట్ టర్మ్  గ్రోత్ కు సంబంధించి మహానగరాలో నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. హైదరాబాద్ రెండో స్థానానికి పడిపోయింది. సాంఘిక ఆర్థిక పరిస్థితులతో పాటు, రియల్ఎస్టేట్, రిటైల్ , హాస్పిటాలిటీ  తదితర వ్యాపారాలను అంచనా వేసి అమెరికాకు చెందిన కంపెనీ జె ఎల్ ఎల్ ప్రతి సంవత్సరం సిటి మొమెంటమ్ ఇండెక్స్ ను ప్రకటిస్తుంది.  జెఎల్ ఎల్ అనేది ఇన్వెస్ట్ మెనేజ్ మెంట్, ప్రొఫెషన్ సర్వీస్ రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా పేరున్న కంపెనీ.

ఈ కంపెనీ మంగళవారం నాడు 2019 జె ఎల్ ఎల్ సిటి మొమెంటమ్ ఇండెక్స్ (JLL City Momentum Index) ను ప్రకటిచింది. 

దీని ప్రకారం ప్రపంచంలో మోస్ట్ డైనమిక్ సిటిగా బెంగళూరు నిలబడింది. హైదరాబాద్ కు రెండో స్థానం దక్కింది. ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే ప్రపంచంలో అగ్రశ్రేణి పది మోస్ట్ డైనమిక్ నగరాలలో అయిదు ఇండియాలోఉన్నాయి. అవి బెంగళూరు (1), హైదరాబాద్ (2), ఢిల్లీ (4), పూణె (5), చెన్నై (7).భారతదేశానికి చెందిన మరొక మహానగరం కలకత్తా 15వ స్థానంలో ఉంది. అంతేకాదు, టాప్ 20 నగరాలలో 19 ఏషియా పసిఫిక్  ప్రాంతంలో ఉన్నాయి. యూరోప్ నగరాలు వీటికి దరిదాపుల్లో లేవు, అంటే ప్రపంచంలోఆర్థికంగా బలమయిన నగరాలుండేది భారత్ వంటి  ఏసియా పసిఫిక్ ప్రాంతంలోనే అర్థమవుతంది. ఈ ట్రెండ్ గత ఏడాది కూడా కనిపించింది. 2018 సిటి మొమెంటమ్ ఎడిషన్లో హైదరాబాద్ (1), బెంగళూరు (2), పూణే (4), కోల్ కత (5), ఢిల్లీ (8) లు ఉన్నాయి. అటు ఇటుగా కొద్ది మార్పులు భారత దేశ నగరాలే, ప్రపంచంలో బలమయిన ఆర్థిక ప్రగతి చూపిస్తున్నాయని, అందులో కూడ హైదరాబాద్ , బెంగళూరులదే అగ్రస్థానం అని  రుజువయింది.

హైదరాబాద్ , బెంగళూరులు టాప్ లో ఉండేందుకు కారణం ఇక్కడ బలమయిన ఇన్ ఫర్మేషన్ ఇండస్ట్రీ ఉండటం, రెండు చోట్ల  స్టార్ట్ అప్ కల్చర్ పటిష్టంగా తయారుకావడం. భారతదేశపు సిలికాన్ వ్యాలీ గా పేరున్న బెంగళూరు పై రెండు కారణాల వల్ల ఈ నగరంలో మిగతా అన్ని వ్యాపారాలు బాగా పుంజుకున్నాయని ఈ రోజు ఈ నివేదిక విడుదల చేస్తూ జె ఎల్ ఎల్ సిఇవొ, ఇండియా కంట్రీ హెడ్ రమేష్ నాయర్ చెప్పారు.

ఇక హైదరాబాద్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ పెట్టుబడులకు మాంచి గమ్యస్థానమయిపోయింది. దీనితో  ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయి. ఫలితంగా నగరాభివృద్ధి అవకాశాలు బలపడ్డాయి. నగరానికి కొత్త ప్రాజక్టులు రావడం,చేపట్టిన ప్రాజక్టులు విజయవంతం కావడం తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దేశంలో బెస్ట్ పర్ ఫరఫార్మర్ అయింది అని ఆయన చెప్పారు.