బ్రేకింగ్ : హైదరాబాద్‌ లో కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం

హైదరాబాద్ ‌లో ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు.

స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. న్యూ ఇయర్ రోజు , ముందు రోజు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతామన్నారు. ఈ నిబంధనలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. యూకేలో వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ గురించి ప్రపంచవ్యాప్తంగా జనం ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు సహకరించాలని సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు

యూకే నుంచి సుమారు 1200 మంది వచ్చారని, వారిలో 800 మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో ఏడుగురికి కరోనా వైరస్ వచ్చినట్టు వైద్యులు తేల్చారు. అయితే, అది యూకే వైరస్సా కాదా అనేది తెలుసుకోవడానికి ఆ శాంపిల్స్ సీసీఎంబీకి పంపారు. ఆ రిపోర్టుల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటు ట్రేసింగ్ కూడా చేస్తున్నారు.