కేసిఆర్ ను తిట్టి కసి తీర్చుకున్న బాబూమోహన్ (వీడియో)

బాబూమోహన్ సినిమాల్లో హాస్య నటుడిగా ఒక వెలుగు వెలిగారు. కానీ రాజకీయాల్లో మాత్రం వెలుగు వెలగలేకపోయారు. దానికి సవాలక్ష కారణాలున్నాయి. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కానీ తర్వాత టిడిపికి గుడ్ బై చెప్పారు. చాలా కాలం తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. టిఆర్ఎస్ లో ఆందోల్ సీటు కేటాయించారు కేసిఆర్. ఉమ్మడి రాష్ట్ర ఉపముఖ్యమంత్రిని మట్టి కరిపించి 2014లో గెలిచారు బాబూమోహన్.

అయితే ఈసారి మాత్రం బాబూమోహన్ కు సీటు లేదని కేసిఆర్ తేల్చి చెప్పేశారు. కార్యకర్తలతో సరిగా లేనందున, జనాలతో సఖ్యతతో లేనందున సర్వేల్లో మంచి రిపోర్ట్ రానందున సీటు లేదని కేసిఆర్ చెప్పేశారు. బాబుమోహన్ తో పాటు మరో సిట్టింగ్ అయిన చెన్నూరు నియోజకవర్గ నేత నల్లాల ఓదేలుకు కూడా టికెట్ లేదని చెప్పేశారు.

నల్లాల ఓదేలు కొద్దిగా హడావిడి చేశారు. స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు. కానీ అంతలోనే విషాదం నెలకొంది. గట్టయ్య అనే నల్లాల ఓదేలు అనుచరుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికత్స పొందుతూ మరణించాడు. బాల్క సుమన్ కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గట్టయ్య ఆత్మహుతికి పాల్పడ్డారు. అయితే తర్వాత బాల్క సుమన్, నల్లాల ఒదేలు ఒక్కటయ్యారు.

ఇక బాబూమోహన్ సీటు లేదనే సరికి తట్టుకోలేకపోయారు. తిరుగుబాటు చేశారు. ఒకప్పుడు బావా, బామ్మార్ది అన్నంత స్నేహం కేసిఆర్ తో బాబూమోహన్ కు ఉన్నది. ఆ చనువుతోనే టిఆర్ఎస్ లో చేరారు. అయితే మంత్రి పదవి వస్తుందని ఆశ పడ్డా బాబుూమోహన్ కు రాలేదు. కానీ ఎలాగైనా తనకు మళ్లీ టికెట్ వస్తుందన్న ఆశలపై కేసిఆర నీళ్లు చల్లడంతో బాబుమోహన్ బిజెపి గూటికి చేరిపోయారు.

బిజెపిలో చేరిన తర్వాత ఒక్కసారిగా బాబూమోహన్ కేసిఆర్ పై విరుచుకుపడ్డారు. తిట్ల వర్షం కురిపించారు. కేసిఆర్ ఫామ్ హౌస్ కు జానెడు దూరంలో కొండగట్టు అంజన్న దేవాలయం వద్ద బస్సు ప్రమాదం జరిగి చనిపోతే బాధితులను పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. సచివాలయం రాని సిఎం కేసిఆర్ ఒక్కడే అని తిట్ల పురాణం అందుకున్నారు. కేసిఆర్ కంటే తీవ్రమైన భాషలో తిట్టారు బాబూమోహన్.

భూ ప్రపంచం మీద సచివాలయం పోకుండా ఉన్న ముఖ్యమంత్రి ఈయనొక్కడే అన్నారు. కొండగట్టు అంజన్న దేవాలయం వద్ద గంత మంది చనిపోతే ఫామ్ హౌస్ కు జానెడు దూరమే అయినా కనీసం అక్కడికి వెళ్లి పరామర్శించడా అని నిలదీశారు. ఎమ్మెల్యేలను కూడా కేసిఆర్ ఎందుకు కలవలేకపోతున్నారు. గేటు కాడ ఎమ్మెల్యేలు పడిగాపులు కాసి వెనుదిరిగిన దాఖలాలున్నాయి. 

బాబూమోహన్ కేసిఆర్ పై నిప్పులు చెరిగిన వీడియో కింద ఉంది చూడండి.

 

 

 

అమృత ప్రణయ్ ని తిట్టి జైలుపాలైన యువకుడు… చదవండి