అమిత్ షాకు అసదుద్దీన్ ఒవైసీ ఆహ్వానం

భారతీయ జనతా పార్టీ జాతీయ నేత అమిషాకు  ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ  చిత్రమయిన ఆహ్వానం విసిరారు. ఈరోజు అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ మీద, ఎంఐఎం మీద బుసలుకొట్టారు. ఎంఐఎంతో స్నేహం వల్లే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం పాటించడం లేదని అన్నారు. కెసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఎంఐఎం చెప్పిన మాట కేసీఆర్ సర్కారు తూచా తప్పకుండా పాటిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను మళ్లీ రజాకార్ల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవకాశవాద రాజకీయాలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్ల సాధ్యంకాదని తెలిసినా బిల్లు పార్లమెంటుకు పంపడం వెనక ఎంఐఎం సంతృప్తి పరిచేవిధానం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలకు అసదుద్దీన్ స్పందించారు.

  హైదరాబాద్‌లో పోటీ చేయాలని అసద్ అమిత్ షాను ఆహ్వనించారు.   అమిత్ షా విధానాలను హైదరాబాద్ తెలంగాణ ప్రజలు తిప్పిగొడతారని అన్నారు. అమిషాయే స్వయంగా హైదరాబాద్‌లో పోటీ చేసినా ఎంఐఎందే విజయమని  ఇప్పుడున్న 5 స్థానాలను కూడా బీజేపీ మళ్లీ దక్కించుకోలేదు అని అన్నారు.  పెట్రోల్ ధరలు, ఉద్యోగాల మీద బిజెపి ఏం చెబుతుందని ఓవైసీ ట్విట్టర్ ప్రశ్నించారు.